ఉప్పొంగిన దౌలిగంగ
ఉత్తరాఖండ్లో ఓ పవర్ ప్లాంట్ వద్ద మంచు దిబ్బలు విరిగిపడటం వల్ల.. దౌలిగంగా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కర్కశ తల్లి
కేరళలో ఓ గర్భిణీ ఆరేళ్ల కుమారుడ్ని హత్య చేసిన దారుణ ఘటన సంచలనం సృష్టించింది. ఆపై తానే పోలీసులకు సమాచారమిచ్చి లొంగిపోయింది. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పాలక్కడ్ ఎస్పీ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఖమ్మంలో కాంగ్రెస్..
ఖమ్మం నగరపాలక సంస్థ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకత్వం... శ్రేణుల్ని సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మంలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు విస్తృతస్థాయి నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అధికార పార్టీ విఫలం
ఖమ్మం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత భట్టి ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్ ఒంటెద్దు పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారని విమర్శించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తెరాస నేతల అండతో భూకబ్జాలు
భాజపా చేపట్టిన 'చలో గుర్రంపోడు తండా' కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నేతలు సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. మఠంపల్లి మండలం పెదవీడు పరిధిలో గల గుర్రంపోడు తండాలో.. సాగర్ నిర్వాసితుల భూములను వారు పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
40 మందికి అస్వస్థత..
నూతన గృహ నిర్మాణం సందర్భంగా ఓ ఇంటి యజమాని ఇచ్చిన విందులో పాల్గొన్న పలువురు అస్వస్థతకు గురైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తైవాన్లోకి చైనా చొరబాటు!
చైనా నిఘా విమానం తమ భూభాగంలోకి ప్రవేశించినట్టు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ నియంత్రణ భూభాగంపై వై-8 విమానం విహరించినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ విమానం తిరిగి వెళ్లేవరకు అక్కడి వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలివే
అంతర్జాతీయ పరిణామాలు.. త్రైమాసిక ఫలితాలే ఈ వారం స్టాక్ మార్కెట్లను ముందుకు నడిపించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు ఆర్బీఐ నిర్ణయాలు, బడ్జెట్ అంశాలు కూడా కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
విండీస్ మాజీ పేసర్ మృతి
వెస్టిండీస్ మాజీ బౌలర్ ఎజ్రా మోస్లీ దుర్మరణం చెందాడు. ఓ ఎస్యూవీ వాహనం ఢీకొట్టడం వల్ల ఆయన మృతి చెందినట్లు ఓ వార్త సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చిరు లీక్స్
'ఆచార్య' చిత్రీకరణ పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో నటించనున్నారు మెగాస్టార్ చిరంజీవి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని 'ఉప్పెన' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో స్వయంగా చిరూనే వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి