- తెలంగాణకు అదనంగా నిధులు
తెలంగాణకు మూలధన వ్యయానికి కేంద్రం అదనంగా నిధులు కేటాయించింది. రూ.179 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నిర్దేశించిన సంస్కరణలను పూర్తి చేసినందున ప్రోత్సాహకంగా అదనపు నిధులను ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాజ్‌ఘాట్ వద్ద 'గాంధీ'కి నివాళి
మహాత్మగాంధీ వర్ధంతి సందర్బంగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు.. రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. మహాత్ముని ఆదర్శాలు లక్షలాది మందిని ప్రేరేపిస్తున్నాయని మోదీ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మహాత్మునికి ప్రముఖుల నివాళి...
హైదరాబాద్‌లోని బాపూ ఘాట్ వద్ద నేతలు నివాళులర్పించారు. గవర్నర్ సహా మంత్రులు మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీజీ ఆదర్శప్రాయ వ్యక్తిత్వాన్ని నేతలు స్మరించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ముగిసిన చర్చలు
పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో మూడు రోజులుగా అధికారుల కమిటీ నిర్వహిస్తున్న చర్చలు పూర్తయ్యాయి. గుర్తింపు పొందిన 13 సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను అధికారులు తీసుకున్నారు. మిగతా సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకుని తుది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారత్ @ 13,083
దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా తగ్గాయి. కొత్తగా 13,083 మంది కొవిడ్ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 7లక్షల 33వేలకు చేరింది. దేశవ్యాప్త రికవరీ రేటు 96.98 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణ @ 186
తెలంగాణలో తాజాగా మరో 186 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ సోకి 1598 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భద్రాద్రి కోవెలకు ముంపు వాటిల్లితే ఊరుకోం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భద్రాద్రి సీతారాములను దర్శించుకున్న మంత్రి.. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గాంధీ విగ్రహం ధ్వంసం
అమెరికా కాలిఫోర్నియాలో గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు దుండగులు. ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు భారతీయ అమెరికన్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 87 ఏళ్ల చరిత్రలో తొలిసారి
ఈ ఏడాది రంజీ ట్రోఫీని నిర్వహించట్లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మీర్జాపూర్ నిర్మాతలకు ఊరట
మీర్జాపూర్ వెబ్‌సిరీస్ నిర్మాతలకు ఊరట లభించింది. తమ ప్రాంతాన్ని తప్పుగా చూపించారని ఓ వ్యక్తి కేసు నమోదు చేయగా దీనిపై విచారించిన అలహాబాదు కోర్టు నిర్మాతల అరెస్టును తాత్కాలికంగా నిలిపివేసింది. మార్చి మొదటి వారానికి విచారణ వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి