ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM - top news in telangana till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana till now
టాప్​టెన్ న్యూస్ @11AM
author img

By

Published : Dec 6, 2020, 10:55 AM IST

  • భారత్​ బంద్​కు కేసీఆర్ మద్దతు..

ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు తెరాస సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెరాస శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దేశంలో కొత్తగా 36 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 36,011‬ పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 482 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో కొత్తగా 622 కరోనా కేసులు, ఇద్దరు మృతి

తెలంగాణలో కొత్తగా 622 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,73,341 మందికి మహమ్మారి సోకింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బ్రిటన్‌ రాణికి కొవిడ్‌ వ్యాక్సిన్‌!

అమెరికన్​ ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్​ను బ్రిటన్​ రాణి ఎలిజబెత్​-2 దంపతులు తీసుకోనున్నట్లు సమాచారం. వ్యాక్సిన్‌ తీసుకున్న వెంటనే ఆ విషయాన్ని ఆమె బహిరంగంగా వెల్లడిస్తారని బకింగ్‌హామ్‌ రాజభవనం వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారీ అగ్నిప్రమాదం- 15 దుకాణాల్లో మంటలు

గుజరాత్​ అహ్మదాబాద్​లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బాపునగర్​లోని శ్యామ్​ శిఖర్​ టవర్​ వద్ద మంటలు చెలరేగాయి. మొత్తం 15 దుకాణాల్లో మంటలు అలుముకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వాహనదారులకు పెట్రో మోత- మళ్లీ పెరిగిన ధరలు

వాహనదారులకు దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచాయి. ఇప్పటికే రెండేళ్ల గరిష్ఠాన్ని తాకిన పెట్రోల్ ధర.. ఆదివారం మరింత పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అంబేడ్కర్​ కలలు కన్న దేశాన్ని నిర్మిస్తాం - మోదీ

రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. అంబేడ్కర్ కలలు కన్న దేశాన్ని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రజనీ రాకతో తమిళనాట పొత్తులాట!

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీకి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అన్నాడీఎంకేతో పొత్తు అంశం కొలిక్కి రాలేదని, దీనిపై అధిష్ఠానానిదే నిర్ణయమని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ ప్రకటన వెనుక భాజపా వ్యూహం ఏదైనా ఉందా? రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భాజపా యోచిస్తోందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆసీస్​కు మరో షాక్.. టీ20లకు స్టార్క్ దూరం

టీమ్​ఇండియాతో జరగనున్న చివరి రెండు టీ20లకు ఆస్ట్రేలియా పేసర్​ మిచెల్​ స్టార్క్​ అందుబాటులో ఉండట్లేదు. అతడి కుటుంబసభ్యుల్లో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వల్ల అతడు అత్యవసరంగా ఇంటికి వెళ్లడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ప్రభాస్ పాత్ర చేసేందుకు భయపడటం లేదు'

యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు. టాలీవుడ్​లో బ్లాక్​బస్టర్​గా నిలిచిన 'ఛత్రపతి' హిందీ రీమేక్​లో ఇతడు హీరోగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.