ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@ 9PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM
author img

By

Published : Jul 5, 2021, 9:00 PM IST

మరో లేఖ

కృష్ణానది యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేసి ఈనెల 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఎన్జీటీలో పిటిషన్

రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation)లో ఉల్లంఘనలను స్వయంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ (National Green Tribunal) బృందం తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో రాయలసీమ ఎత్తిపోతలపై రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'వాటిల్లో జోక్యం చేసుకోవచ్చా'

అంతర్రాష్ట్ర జలవివాదాల(Interstate Water Disputes)పై ప్రత్యేక ట్రైబ్యునళ్లు ఉన్నప్పుడు.. కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటాయో తెలపాలని ఉన్నత న్యాయస్థానం (Highcourt) పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అనుమతి ఇవ్వొద్దు'

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల (Rayalaseema Lift Irrigation) పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ప్రపంచవ్యాప్తంగా కొవిన్​ యాప్'​

గత వందేళ్లలో కరోనా లాంటి మహమ్మారి మరొకటి రాలేదని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పేర్కొనారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందినవారికి మోదీ నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఏం సందేశం ఇస్తున్నారు?

పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసనసభ్యుల 'అనుచిత ప్రవర్తన'పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో మైకులు విసరడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనుల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించింది. ఇటువంటి ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వచ్చే వారమే మోడెర్నా.!

దేశంలో మోడెర్నా టీకా(Moderna Vaccine) జులై 15 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీకాల దిగుమతి ప్రక్రియను ఫార్మా సంస్థ సిప్లా ప్రారంభించింది. ఈ వారం చివరి నాటికి ఇవి భారత్​కు రానుండగా.. ఆస్పత్రులకు కేటాయించేందుకు మరోవారం పట్టనుందని సమాచారం.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

టీఎంసీ గూటికి ప్రణబ్ తనయుడు

మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ.. తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. కోల్​కతాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన టీఎంసీ కండువా కప్పుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

థియేటర్లు రీ-ఓపెన్​.. ఎప్పుడంటే..?

కరోనా కారణంగా కుదేలైన సినిమా థియేటర్ వ్యవస్థకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సినిమా థియేటర్ల విషయంలో.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మెగా టోర్నీలకు బీసీసీఐ బిడ్లు!

2024-2031 మధ్య ఐసీసీ టోర్నీల ఆతిథ్యానికి మనతో పాటు పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో మూడు అతిపెద్ద టోర్నీల నిర్వహణకు బిడ్లు దాఖలు చేయాలని బీసీసీఐ.. గతనెల నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.