విచారణకు డ్రగ్స్ కేసు
సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు (Drugs Case)ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. ఎక్సైజ్ సిట్ సమర్పించిన అభియోగపత్రాలను న్యాయస్థానం ఆమోదించింది. 4 సంవత్సరాల తర్వాత ఈ కేసులో విచారణ మొదలుకానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దిల్లీకి దర్భంగ నిందితులు
బిహార్ దర్భంగ (Darbhanga blast) పేలుడు కేసులో ఇద్దరు నిందితులను ఎన్‌ఐఏ (NIA)అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారిని ట్రాన్సిట్ వారెంట్‌పై దిల్లీకి తీసుకువెళ్లారు. అక్కడ ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసు గురించి క్షుణ్ణంగా విచారించేందుకు నిందితులిద్దరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ప్రజల జీవితాలపై మరణ శాసనం '
రెండున్నర కోట్ల ప్రజల జీవితాల మీద మరణ శాసనం రాస్తుంటే.. సీఎం కేసీఆర్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్‌కు చెందిన అన్ని విభాగాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మాది చేతల ప్రభుత్వం
రైతు సంక్షేమం గురించి గత పాలకులు మాటలు చెబితే.. కేసీఆర్ ప్రభుత్వం చేతల్లో చూపిస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా రూపంలో అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతోన్న పథకాలు.. దేశంలోనే ఎక్కడా లేవన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సాగర్ వద్ద భారీ భద్రత
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం వద్ద భారీ భద్రత కొనసాగుతోంది. ఆనకట్ట, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల వద్ద... సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఉద్యోగులు మినహా ఇతరులెవరినీ పవర్ హౌజ్‌లోకి అనుమతించడం లేదు. మరోవైపు జల విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదని... ఆ హక్కు ఏ కమిటీకి, కమిషన్‌కు లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. అటు జూరాల, పులిచింతల జలాశయాల వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'విపత్తు వేళ వారి సేవలు భళా!'
కరోనాపై పోరులో వైద్యుల కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మహమ్మారిపై విజయం సాధించడంలో వారి అనుభవాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. వైద్య రంగ బడ్జెట్‌ను రెట్టింపు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'సాంకేతిక సాధికారత'
డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం మాట్లాడారు. టెక్నాలజీ, యువశక్తి.. భారత దేశాభివృద్ధికి భారీ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వాటికి ఆదాయం ఎలా?
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు తీసుకోవు. అందులో ప్రకటనలు కూడా రావు. ఈ ఉచిత మెసేజింగ్ సేవల వల్ల వాటికి లాభమేంటి? రోజు వారీ కార్యకలాపాల కోసం కావాల్సిన నిధులు ఏ విధంగా సమకూరుతాయి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పాండ్యాకు కపిల్ చురకలు
ఈతరం క్రికెటర్ల మానసిక వైఖరిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు టీమ్ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్. నాలుగు ఓవర్లు వేయగానే బౌలర్లు అలసిపోవడం ఏంటని.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేజీఎఫ్‌కు రికార్డు ధర
కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన 'కేజీఎఫ్ 2'(KGF 2) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను(KGF Audio Rights) రెండు ప్రముఖ మ్యూజిక్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. దక్షిణాదిలోని అన్ని భాషల్లో ఆడియో హక్కులను అధిక మొత్తం చెల్లించి చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.