ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM
author img

By

Published : Jun 30, 2021, 8:59 PM IST

జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు, చేర్పులకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రేపటి నుంచే ప్రారంభం

హరిత తెలంగాణే లక్ష్యంగా.. రేపటి నుంచి ఏడో విడత హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ దఫా.. 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రహదారుల వెంట బహుళ వరుసల్లో వనాల అభివృద్ధి, అధిక విస్తీర్ణంలో ప్రకృతి వనాల అభివృద్ధికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతీ ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హరిత విప్లవానికి నాంది

దేశంలో రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది పలికిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లు, యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్​ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ సమక్షంలో విస్తృత సమావేశం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటి వరకు మంత్రుల స్థాయిలో వాగ్యుద్ధం జరగ్గా.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్​.. మొట్టమొదటిసారి జలజగడాలపై స్పందించారు. మంత్రివర్గ (AP CABINET))సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆపరేషన్ 2.0

జమ్ముకశ్మీర్​లో నియోజకవర్గాల విభజనకు రంగం సిద్ధం కానుంది. అందుకోసం నియోజకవర్గాల పునర్‌విభజన కమిషన్‌ జులై 6 నుంచి 9 మధ్య కశ్మీర్​లో పర్యటించనుంది. అక్కడి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించనుంది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆరు వారాల్లో తేల్చండి

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిహారానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశాల్లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గాజీపుర్​లో ఘర్షణ

దిల్లీ గాజీపుర్​ సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులకు, భాజపా కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో.. ఇరువర్గాల వారు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరోసారి డ్రోన్ల కలకలం

జమ్మూలోని మూడు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. ఆ డ్రోన్లపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నాలుగు రోజుల్లోనే 7 డ్రోన్ల కదలికలను గుర్తించటం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బ్యాంకుల్లో కొత్త రూల్స్ ఇవే..!

మీకు బ్యాంకు ఖాతా ఉందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. జులై 1 నుంచి ఎన్నో మార్పులు రానున్నాయి. కొన్ని బ్యాంకులు తమ సర్వీస్​ ఛార్జీలు పెంచగా.. మరికొన్ని ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లే చెల్లవని చెప్పాయి. మరి ఏఏ బ్యాంకులు ఏం మార్పులు చేశాయో, కస్టమర్లు ఏం చేయాలో తెలుసుకోండి.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఖేల్​రత్నకు వారిద్దరు.!

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్నకు స్పిన్నర్​ అశ్విన్​, మిథాలీ రాజ్ పేర్లను సిఫార్సు చేసింది భారత క్రికెట్ బోర్డు. అర్జున అవార్డుకూ పలువురు క్రికెటర్ల పేర్లను ప్రతిపాదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.