వాటి విలువ పెంచుదాం
భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని.. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల విలువల సవరణకు ప్రతిపాదనలు పంపింది. వెంటనే సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి రిజిస్ట్రేషన్ విలువల్లో సర్కారు ఎటువంటి మార్పులు చేయలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వారికే ఆన్లైన్ తరగతులు
జులై 1 నుంచి రాష్ట్రంలో ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకే ఆన్లైన్ (inter online class) తరగతులు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు (inter board) కార్యదర్శి జలీల్ ప్రకటించారు. ప్రవేశాలు ముగిసిన అనంతరం మొదటి సంవత్సరం తరగతులు ఉంటాయని తెలిపారు. టీశాట్, దూరదర్శన్ ద్వారా తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేవంత్ ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. తెరాస అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలను, మంత్రులను పైరవీకారులుగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ దిగిపోతేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తహసీల్దార్‌పై డీజిల్
మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ.. కొందరు రైతులు, గిరిజనులు తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్ పోశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మోదీ కీలక భేటీ
ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోభాల్‌తో భేటీ అయ్యారు. రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లపై చర్చించారు. జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ దాడుల ముప్పు నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వివరణ ఇవ్వాల్సిందే.!
కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖాతాల నిలిపివేతపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ట్విట్టర్‌ను ఆదేశించింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ తర్వాతే రెండో డోసు
టీకా డోసుల మధ్య వ్యవధి ఎంతుంటే మంచిదనే అంశంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పుడు కొవిషీల్డ్‌కు 12-16 వారాల సమయం ఉండగా.. కొవాగ్జిన్ రెండో డోసును 4-6 వారాల అంతరం ఉంది. అయితే.. కొవిషీల్డ్ రెండో డోసు 45 వారాల తర్వాత తీసుకుంటే.. రోగ నిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారవుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మోడెర్నాకు గ్రీన్ సిగ్నల్
భారత్‌లో మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించింది. ఈ టీకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు.. సిప్లా సంస్థకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దిగొచ్చిన పసిడి
పసిడి, వెండి ధరలు మంగళవారం కాస్త దిగొచ్చాయి. పది గ్రాముల బంగారం ధర దిల్లీలో (Gold rate in India) దాదాపు రూ.90 తగ్గింది. వెండి ధర కిలో (KG Silver price in India) రూ.68 వేల దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పొట్టి కప్ షెడ్యూల్ విడుదల
పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు పొట్టి ప్రపంచకప్‌ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.