'మార్గదర్శకాలు సిద్ధం చేయండి '
పిల్లల ఆరోగ్యం, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల ప్రారంభంపై వారం రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది. ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదని.. ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని విద్యా శాఖ వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఇంతకు మించొద్దు'
కొవిడ్ చికిత్సల కోసం ప్రభుత్వం(government) ఖరారు చేసిన గరిష్ఠ ధరలను(rates) అమలు చేయని ప్రైవేట్ ఆస్పత్రులపై భారీ జరిమానాలు(fines) విధించాలని హైకోర్టు(HC) పేర్కొంది. కరోనాతో (Corona) తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను చేరదీసి వారి అవసరాలు తీర్చాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మార్గదర్శకాలివే..!
తెలంగాణలో ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలకు (Inter second year results) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం(TS government) మార్గదర్శకాలు(guidelines) ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరో ఐదు నెలలు
దీపావళి వరకు ఉచిత రేషన్ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో ఐదు నెలల పాటు ఉచితంగా రేషన్ అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వారికి శుభాకాంక్షలు
అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI), భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. మన దేశం తరఫున ఇప్పటివరకు పోటీల్లో పాల్గొన్న వారికి, మరికొన్ని రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ బరిలో దిగనున్న క్రీడాకారులకు విషెస్ చెప్పారు. ఇంతకీ ఈ ఒలింపిక్ డే ఎప్పుడు మొదలైంది? దీని చరిత్రేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కొత్తరకం' కేసులు
దేశంలో 40కి పైగా 'డెల్టా ప్లస్' వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 21మందికి ఈ వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నీరవ్‌కు షాక్.!
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ని భారత్‌కి అప్పగించాలన్న యూకే కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకున్న లిఖితపూర్వక అభ్యర్థనను లండన్ కోర్డు తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
స్వల్పంగా పెరిగింది
బంగారం, వెండి ధరలు బుధవారం కాస్త పెరిగాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి(Gold rate in India) ధర దిల్లీలో రూ.46,400 వద్దకు చేరింది. కిలో వెండి (Silver rate in India) రూ.300కుపైగా పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
లక్ష్యం దిశగా కివీస్
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ టీ విరామ సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో లాథమ్(5*), కాన్వే(9*) ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'మా లొల్లి'
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ సాధారణ ఎన్నికలకు తలపిస్తుంటుంది. ఈసారి కూడా అధ్యక్ష పోటీకి బలమైన అభ్యర్థులే రంగంలోకి దిగుతున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.