ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM - టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @9PM
TOP TEN NEWS @9PM
author img

By

Published : Nov 14, 2020, 8:57 PM IST

  • పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన..

పాక్..​ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంపై ఆందోళన వ్యక్తం చేసింది భారత్​. పండుగ వాతావరణం వేళ ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడాన్ని ఖండించింది. ఈ మేరకు ఆ దేశ హై కమిషనర్​ను పిలిపించి నిరసన తెలిపింది విదేశాంగ శాఖ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు..

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 43వ వసంతంలోకి..

దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్టీపీసీ 42 ఏళ్లు పూర్తిచేసుకొంది. మహారత్నగా కీర్తిగడించి.. నేడు 43 వసంతంలోకి అడుగుపెట్టింది. దక్షిణాది వెలుగురేఖ రామగుండం ఎన్టీపీసీపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కబ్జాకోరల్లో ఖానాపూర్‌ చెరువు..

కబ్జాదారుల ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యం... ఖానాపూర్‌ చెరువు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వందకుపైగా ఎకరాల విస్తీర్ణంతో ఆయకట్టు అన్నదాతలకు సాగునీరందించిన తటాకం.. నేడు కుచించుకుపోయి మనుగడకే ముప్పు వాటిల్లే స్థితికి చేరుకుంది. వందలాది మత్స్యకారులకు జీవనోపాధిగా నిలిచిన జలాశయం.. చెత్తచెదారం, గుర్రపుడెక్క పేరుకుపోయి ప్రమాదకరంగా పరిణమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'దీపావళి' పండుగ పేరు మాత్రమే కాదు..

దీపావళి అంటే అందరికి పండుగ అని మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ అక్కడి ప్రజలకు మాత్రం తమ ఊరు గుర్తుకు వస్తుంది. దీపావళి పండగ పేరుతో ఏకంగా ఓ గ్రామం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడో లేదండోయ్. ఏపీ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది. అసలు ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి..!

రాజస్థాన్​లో దారుణం జరిగింది. అధిక మొత్తంలో మద్యం తాగి ఐదుగురి ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అంజన్నకు రూ.6.5 కోట్ల బంగారు వస్త్రాలు..

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సారంగ్​పుర్​ హనుమంతునికి భక్తులు భారీ విరాళం ఇచ్చారు. సమారు ఆరు కోట్ల యాభై లక్షలు విలువ చేసే బంగారు వస్త్రాలు, ఆభరణాలను తయారు చేయించి ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒబామాపై ఫైర్​..!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా..కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది శివసేన. రాహుల్​ గాంధీని సమర్థిస్తూ ఒబామాపై విమర్శలు చేశారు శివసేన నేత సంజయ్​ రౌత్​. ఒబామాకు భారత్​ గురించి ఎంత మాత్రం తెలుసునని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చాలి ..

ఒలింపిక్స్​లో టీ20 క్రికెట్​ను చేర్చాలని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ సారథి రాహుల్​ ద్రవిడ్​. ఇది జరిగితే క్రికెట్​ మరింత అభివృద్ధి చెందుతుందన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముచ్చటగా మూడో సినిమా..

హీరో సుధీర్​ బాబు దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబోలో మూడో చిత్రం ఖరారైంది. ఇందులో హీరోయిన్​గా 'ఉప్పెన' ఫేం కృతిశెట్టి ఎంపికైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.