- ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా
హరిత తెలంగాణే లక్ష్యంగా.. నేటి నుంచి ఏడో విడత హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ దఫా.. 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రహదారుల వెంట బహుళ వరుసల్లో వనాల అభివృద్ధి, అధిక విస్తీర్ణంలో ప్రకృతి వనాల అభివృద్ధికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
గ్రామసీమలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతూ.. ప్రణాళికాభివృద్ధే ధ్యేయంగా మరో దఫా పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పనులు, ఫలితాలను సమీక్షించుకొని తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసి అవసరమైన పనులు చేపడతారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు
తెలంగాణలో నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 30 ఏళ్లు పైబడిన వారికి టీకా అందించిన సర్కారు జులై 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా అందించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి టీవీ పాఠాలు
రాష్ట్రంలో నేటినుంచి పాఠశాల విద్యార్థులకు టీవీ పాఠాలు మెుదలుకానున్నాయి. గతేడాది ప్రత్యక్ష తరగతులు జరగనందున కింది తరగతుల పాఠ్యాంశాలపై అవగాహన పెంచేందుకు రోజుకో మాధ్యమానికి అరగంటపాటు పాఠాలను ప్రసారం చేయనున్నారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలు కలిపి దూరదర్శన్ యాదగిరి, టీ-శాట్ విద్యా ఛానెల్ ద్వారా రోజుకు 8 గంటల పాటు పాఠాలు ప్రసారం అవుతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'న్యాయ వ్యవస్థపై నియంత్రణ తగదు'
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దుమారం రేపుతున్న మంత్రి వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌లో పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచుతున్నాయని తమ బాధలు చెప్పుకునేందుకు మంత్రి వద్దకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రులపై కోపోద్రిక్తుడైన ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి.. 'చస్తే చావండి' అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌కు మిత్రుల అండ
నలభైకిపైగా దేశాలకు కష్టకాలంలో టీకాల పంపిణీతో సాయం చేసిన భారత్‌కు ఇప్పుడు ప్రతిఫలంగా ఆ దేశాలు తమవంతు సహాయాన్ని అందజేస్తున్నాయి. దేశంలో మహమ్మారి రెండో దశ ఆందోళనకర పరిస్థితులు ఏర్పరిచిన నేపథ్యంలో అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్య సహా పశ్చిమాసియా దేశాలు తమ మద్దతు అందించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ మిశ్రమ డోసుల ప్రభావం ఎక్కువే!
కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు.. అమెరికాకు చెందిన ఫైజర్ టీకాను కలిపి తీసుకుంటే ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీమ్ఇండియాకు నిరాశ.. ఇంగ్లాండ్‌దే వన్డే సిరీస్
టౌంటన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళా జట్టు ఓడిపోయింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఆతిధ్య ఇంగ్లీష్ జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లోకల్ సింగర్‌కు సినిమాలో పాడే అవకాశం
మట్టిలో పుట్టిన మాణిక్యం శర్వాణి మధురమైన గాత్రం.. చెన్నైకి చేరింది. ఆమె సింగింగ్ ప్రస్థానానికి తొలి అడుగుపడింది. ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ ఈ లోకల్ గాయని ప్రతిభ గురించి ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌కు తెలియజేశారు. ఆమె గాత్రానికి ముగ్ధుడైన డీఎస్పీ.. శర్వాణికి తన రాక్‌స్టార్ ప్రోగ్రామ్‌లో అవకాశమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.