ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @9AM - Top ten news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @9AM
టాప్‌టెన్‌ న్యూస్‌ @9AM
author img

By

Published : Jun 4, 2021, 8:58 AM IST

Updated : Jun 4, 2021, 9:50 AM IST

  • కొవిడ్‌ చికిత్సకు బ్యాంకుల సాయం..

తమ ఖాతాదారులు కొవిడ్‌ బారిన పడి, డబ్బు అవసరమైనప్పుడు రుణాలు ఇచ్చేందుకు ఇప్పుడు పలు ప్రభుత్వ బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు దీనికి సంబంధించి ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • లెక్క తిరిగొచ్చేనా..

కరోనా చికిత్స పేరిట పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వసూలు చేశాయి. కొవిడ్ రోగుల నుంచి ఇష్టానుసారంగా లక్షల్లో ఫీజులు గుంజుకున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై రాష్ట్ర హైకోర్డు స్పందించింది. ప్రస్తుతం బాధితులు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలివ్వడం ప్రాధాన్యతను సంతరిచుకున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • సమస్య తీరేనా..

అపరిష్కృతంగా ఉన్న భూయాజమాన్య హక్కుల సమస్యలు రైతులను ఆందోళనలోకి నెడుతున్నాయి. రైతుబంధు చెల్లింపులకు ఈ నెల పదో తేదీ కటాఫ్‌గా నిర్ణయించిన నేపథ్యంలో ఆలోగా సమస్యలు పరిష్కారం కావాలని కోరుతున్నారు. వచ్చిన ఫిర్యాదులు, సమస్యలన్నింటినీ శనివారం నాటికి పరిష్కరించాలని కలెక్టర్లకు డెడ్‌ లైన్‌ విధించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • నేడే బాధ్యతల స్వీకరణ..

శాసనమండలి ప్రొటెం ఛైర్మన్​గా (Protem Chairman) ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి (Mlc Bhupal reddy) ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరిగే వరకు భూపాల్ రెడ్డి ప్రొటెం ఛైర్మన్ బాధ్యతల్లో ఉంటారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • జలమండలిపై కొవిడ్ పంజా..

హైదరాబాద్​ జలమండలి అధికారులపై కరోనా(Covid) పంజా విసురుతోంది. రెండో విడతలో దాదాపు 30 మంది వైరస్ బారినపడ్డారు. కొందరు చికిత్సతో కోలుకున్నారు. మరికొందరు మహమ్మారికి బలయ్యారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఏపీ వెనుకంజ..

వ్యాక్సినేషన్‌లో ఏపీ చాలా వెనుకబడిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పార్టీ కీలక నేతలతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించిన ఆయన... మూడోదశ అప్రమత్తతపై కీలక సూచనలు చేశారు. తప్పుడు గణాంకాలతో కేసులు తగ్గించి చూపిస్తున్నారని ఆరోపించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • రాజద్రోహానికి వక్రభాష్యాలు..

ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు, సంస్థలపై దేశద్రోహం కేసులు నమోదు కావడం ఏటా పెరుగుతూ వస్తోంది. అది భావప్రకటనా స్వేచ్ఛ అని ఆయా వ్యక్తులు చెబుతుంటే.. రాజద్రోహ చర్యేనని ప్రభుత్వాలు అంటున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • అదే గేమ్​ఛేంజర్..

భారత్​లో కరోనా కట్టడిపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచితే మహమ్మారిని నివారించే అవకాశముందని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • సెహ్వాగ్​దే ఆధిపత్యం​..

టీమ్ఇండియా మాజీ బ్యాట్స్​మన్​ వీరేంద్ర సెహ్వాగ్(virender sehwag)​పై పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ సక్లాయిన్​ ముస్తాక్(Saklain Mustak)​ ప్రశంసలు కురిపించాడు. వీరూ ఆటతీరు ప్రపంచంలోని అనేకమంది క్రికెటర్లపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • 'మిషన్ ఇంపాజిబుల్'కు బ్రేక్..

కరోనా కారణంగా 'మిషన్ ఇంపాజిబుల్ 7'(Mission Impossible 7) షూటింగ్​కు బ్రేక్ పడింది. ఓ వ్యక్తికి కరోనా సోకడం వల్ల లండన్​లోని సెట్​ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 4, 2021, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.