ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @9AM
టాప్​టెన్​ న్యూస్​ @9AM
author img

By

Published : May 23, 2021, 8:59 AM IST

  • తీవ్రమవుతున్న 'యాస్'..

యాస్ తుపాను క్రమంగా బలపడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు కోల్​కతాలోని శామాప్రసాద్​ ముఖర్జీ పోర్ట్​ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీగా నిలిచిన వాహనాలు..

కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో లాక్​డౌన్​ కఠినంగా అమలవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ-పాస్‌ను తప్పనిసరి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎయిర్ అంబులెన్సులకు డిమాండ్..

రెండో విడతలో దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో సాధారణ అంబులెన్సులే కాదు...ఎయిర్‌ అంబులెన్సులకు డిమాండ్‌ పెరిగింది. ఆరోగ్యం క్లిష్టతరంగా మారిన రోగులను ఒక నగరం నుంచి మరో నగరానికి తరలించడానికి ఎయిర్‌ అంబులెన్సులను వాడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పిల్లలకూ టీకా!

దేశంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన అందరికీ కొవిడ్‌ టీకా వేస్తున్నారని.. వైరస్‌లో వేరియంట్లు మారుతున్న కొద్దీ పిల్లలపై ప్రభావం పెరుగుతోందని ప్రఖ్యాత టీకా తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ వ్యాపారాభివృద్ధి విభాగాధిపతి డా.రేచస్‌ ఎల్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్‌ 1 నుంచి పిల్లల మీద టీకా పరీక్షలు (పీడియాట్రిక్‌ ట్రయల్స్‌) మొదలు పెట్టబోతున్నామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఏపీలో పకడ్బందీగా..

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండగా.. పోలీసులు కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కరోనా రోగుల కోసం దాతలు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింపు కోసం రాష్ట్రానికి మరో 4 లక్షల 44 వేల కొవిషీల్డ్ టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్‌ ఫంగస్‌ కేసులూ అధికంగానే నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తుపాను సన్నద్ధతపై మోదీ సమీక్ష..

తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే యాస్​ తుపాను ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాహక చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నేడు ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు.. ఈ తుపాను ముప్పు పొంచి ఉన్నందున తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అగ్నిపర్వతం విస్ఫోటనం..

కాంగోలోని ఇరగోంగో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారి వైపు వచ్చింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గాలిని శుద్ధి చేసే యంత్రం..

కార్యాలయాల్లో గాలిని వైరస్ రహితంగా చేసే పరికరాన్ని విడుదల చేసింది హైదరాబాద్​కు చెందిన ఓ అంకుర సంస్థ. ఈ పరికరంతో గాలిలో ఉండే హానికర వైరస్‌లను కట్టడి చేసి నిర్మూలించవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైకల్యాన్ని అధిగమించి..

తొలిసారి పారా ఒలింపిక్స్​లో బ్యాడ్మింటన్​ ప్రవేశపెట్టగా, ఆ పోటీలకు అతి చిన్న వయసులోనే అర్హత సాధించింది పలక్ కోహ్లీ. వైకల్యాన్ని అధిగమించి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆమె గురించి విశేషాలే ఈ కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జాన్వీ టాలీవుడ్​ ఎంట్రీ!

దర్శకుడు త్రివిక్రమ్​-హీరో మహేశ్​ బాబు కాంబోలో రానున్న కొత్త సినిమాతో తన కుమార్తె జాన్వీ కపూర్​ను టాలీవుడ్​కు పరిచయం చేయాలని ప్రముఖ నిర్మాత బోణీకపూర్​ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.