- అప్రమత్తమైన ప్రభుత్వం...
రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులకు చికిత్స అందించేందుకు కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించింది. కొవిడ్ సమయంలోనే బ్లాక్ ఫంగస్ సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోటా పెంపు...
ముఖ్యమంత్రి కేసీఆర్ వినతి మేరకు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి రెమ్‌డెసివర్, ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోలుకున్నా వదలట్లేదా?...
కరోనా చికిత్స అనంతరం కొందరిలో ఉన్నట్టుండి మెదడు, గుండె, ఊపిరితిత్తుల్లో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. స్టెరాయిడ్స్ వాడినవారి రక్తంలో చక్కెర స్థాయులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వారికే ముప్పు...
కరోనా తదనంతరం వచ్చే ఆరోగ్య సమస్యల్లో బ్లాక్ ఫంగస్ ఒకటి. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకే పరిమితమైన ఈ బ్లాక్ ఫంగస్.. మరణాలు మన రాష్ట్రంలోనూ నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుజరాత్ దిశగా..
తౌక్టే తుపాను.. గుజరాత్ దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18న పోర్బందర్- నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశముందని పేర్కొంది. గోవా, కొంకణ్, మహారాష్ట్రపై తుపాను ప్రభావం చూపనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏ రాష్ట్రాల్లో ఎలా?...
దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడికి వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. బంగాల్లో ఆదివారం నుంచి మే 30 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిర్లక్ష్యం వల్లే కరోనా వ్యాప్తి...
కరోనా మహమ్మారి మొదటి దశ తర్వాత ప్రభుత్వం, ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెట్రో మోత...
దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. చమురు ధరలను పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్‌పై 24పైసలు, లీటరు డీజిల్‌పై 27పైసలను పెంచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐపీఎల్ ప్రారంభమైతే...
నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్.. తిరిగి ప్రారంభమైతే ఆడటానికి తాను సిద్ధమని తెలిపాడు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్. లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్.. వేలి గాయం కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆ సినిమా 267సార్లు చూశా!'...
మ్రాన్ హష్మితో కలిసి నటించిన 'వై చీట్ ఇండియా' సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది ఆ తెలుగమ్మాయి. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'స్కామ్ 1992' సిరీస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె శ్రేయా ధన్వంతరి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.