ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్ @9AM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @9AM
టాప్‌టెన్‌ న్యూస్ @9AM
author img

By

Published : Nov 21, 2020, 8:56 AM IST

  • ఇక నుంచి అన్నీ..

మార్చి నుంచి కేవలం కొవిడ్​ సేవలకు మాత్రమే పరిమితమైన గాంధీ ఆసుపత్రిలో ఎట్టకేలకు మిగితా సేవలను అందుబాటులోకి తెచ్చారు. నేటి నుంచి ఈ సేవలను ప్రారంభమయ్యాయి. కొవిడ్​ రోగులు తగ్గిన దృష్ట్యా... ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పోలింగ్‌కు పోటెత్తాలి..

భాగ్యనగరంలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ రోజున ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేటి నుంచి రోడ్​ షోలు..

మరోసారి బల్దియా మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార తెరాస... ప్రచార వ్యూహాలు సిద్ధం చేసింది. గ్రేటర్‌ ఎన్నికలకు సారథ్యం వహిస్తున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ నేడు ప్రచార రంగంలోకి దిగనున్నారు. రోడ్‌షోలతో నగరమంతా మెరుపు ప్రచారం చేసి మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సాగర్‌ టూ శ్రీశైలం..

నాగర్జునసాగర్​ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 9:30కు బయలు దేరిన లాంచీ పర్యటన పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం 3:30 కు తిరిగి వస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • విచ్రిత ఘటన..

రాష్ట్రమంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికల వైపు చూస్తుండగా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జప్తీవీరప్పగూడెంలోని ఓటర్లకు మాత్రం పంచాయతీ ఎన్నికలైన రెండేళ్లకు ఇంటింటికీ డబ్బులందడం విశేషం. గ్రామంలో 963 ఓట్లుండగా.. ఓటుకు రూ.3,200 చొప్పున నగదు పంపిణీ జరిగింది. దీనిపై కొందరు పోలీసుల వద్దకు వెళ్లగా గ్రామస్థులే పరిష్కరించుకోవాలంటూ పంపేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 75వేలకు పసికందు అమ్మకం..

పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను అంగట్లో అమ్మేసిందో తల్లి. కన్న బంధాన్ని మరిచి పొత్తిళ్లలోని బిడ్డను రూ.75 వేలకు విక్రయించింది. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రమాదంలోకి నెట్టొద్దు..

చిన్నారుల బంగారు భవిష్యత్తు.. చుట్టూ ఉండే మంచి పర్యావరణంపై ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దానిని ప్రమాదంలోకి నెట్టే అధికారం పెద్దలకు లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వెబ్​నార్​లో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా వ్యాప్తి ఇలా..!

తుమ్ములపై పరిశోధనల ద్వారా కరోనా వైరస్​ ఎలా వ్యాప్తి చెందుతుందో అమెరికా శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ముక్కు సాఫీగా ఉంటే తుమ్ము ద్వారా నోటి నుంచి వచ్చే తుంపర్ల వేగం దూరం పరిమితంగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. వెలుపలికి రావడానికి దానికి స్పష్టమైన దారి ఉండటమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వందో వసంతంలోకి..

వందేళ్లు బతికిన రంజీ ఆటగాళ్ల జాబితాలో మరో ఆటగాడు చేరాడు. నవంబర్​ 21(శనివారం)న రఘునాథ్​ చంతోర్కర్​ శతవసంతంలోకి అడుగుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చిరుతో 'ధృవ' డైరెక్టర్​..

'లూసిఫర్'​ రీమేక్​ చిత్రానికి దర్శకత్వ బాధ్యతల్ని మోహన్​రాజాకి మెగాస్టార్​ చిరంజీవి అప్పగించినట్లు సమాచారం. కాగా, ఈ దర్శకుడు హీరో రామ్​చరణ్​తోనూ ఓ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిసింది. ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శత్వంలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.