ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
పార్టీ సీనియర్లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మర్రి శశిధర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు జరుగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' నీటి వివాదాన్ని పరిష్కరించండి'
తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఏపీ ఎంపీ రఘురామ కేంద్రమంత్రి షెకావత్‌కు లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తేలే వరకు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉండేలా చూడాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ముమ్మరంగా ఏర్పాట్లు
నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఆ పిటిషన్లు సుప్రీంకోర్టుకు!'
నూతన ఐటీ రూల్స్(New IT Rules)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ అధికారి ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'నేను రాజకీయాల్లోకి ఎప్పటికీ రాను...!'
సీఎం కేసీఆర్ మనవడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆసక్తిగా మారింది. తాను భవిష్యత్‌లో ఏం చేయదలుచునేది... సాధించాలనుకునేది చాలా స్పష్టం చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దీదీ కొత్త స్కెచ్!
శాసన మండలి ఏర్పాటు చేయాలని కోరుతూ.. తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బంగాల్ శాసనసభ ఆమోదించింది. 196 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. మరో 69 మంది వ్యతిరేకించారు. భాజపా సభ్యులు ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మళ్లీ లాక్డౌన్ తప్పదా?
హిల్ స్టేషన్లకు పర్యటకులు పోటెత్తటంపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలీలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించట్లేదని పేర్కొంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇక ఉదయం 3 వరకు బార్లు!
మందుబాబులకు కిక్కెచ్చే కబురు. ఇక నుంచి అక్కడ తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు, రెస్టారెంట్లు తెరిచే ఉండనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వారికి అండగా ఉండాలి
టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) పాల్గొనే భారత అథ్లెట్స్ బాగా ఆడాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్(Sachin Tendulkar). ప్రతిఒక్కరూ వారికి మద్దతుగా నిలవాలని కోరాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ సినిమాలో లెజండరీ యాక్టర్లు
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్(Karan Johar).. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' అనే ప్రేమకథకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రణ్వీర్ సింగ్(Ranveer Singh), అలియా భట్(Alia Bhatt) హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ లెజండరీ నటీనటులు ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలకపాత్రలు పోషించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.