- కొత్తగా 858 కరోనా కేసులు..
రాష్ట్రంలో కొత్తగా 858 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది మృతి చెందారు. ప్రస్తుతం 12,726 యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో సోదాలు
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అధికారులు ఆరాా తీస్తున్నారు. పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం కేసీఆర్‌కు కేటీఆర్ థాంక్స్..
కొత్త జోనల్ వ్యవస్థ (new zonal system) ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, విద్యావకాశాల్లో సమాన వాటా దక్కుతుందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (minister ktr) అన్నారు. సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్‌తో జోనల్ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించి, అమల్లోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అనుమతి లేకుండా ప్రాజెక్టులా..
కృష్ణా నది నీటి పంపిణీలో భాగంగా తెలంగాణకు 500 టీఎంసీల నీటి వాటా రావాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కత్తి మహేశ్‌కు సాయం..
సినీ విశ్లేషకులు, సినీ నటుడు కత్తి మహేశ్ (Kathi mahesh ) వైద్యం కోసం ఏపీ ప్రభుత్వం రూ.17లక్షలు ఆర్థిక సహాయం చేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి(CM relief fund) ద్వారా ఈ మొత్తాన్ని విడుల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దీటుగా బదులిస్తాం..
భారత సైనిక దళాలను తేలికగా తీసుకోరాదన్న విషయం చైనాకు అర్థమైందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. భారత్-చైనా తూర్పు లద్దాఖ్‌లో యథాతథస్థితిని నెలకొల్పాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వీడని ముప్పు..
కరోనా రెండో దశ ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. వేగంగా టీకా పంపిణీతో పాటు.. కరోనా నిబంధనలను విధిగా పాటిస్తేనే మహమ్మారి ముప్పు నుంచి బయటపడగలమని ఉద్ఘాటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెరిగిన బంగారం..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం.. దిల్లీలో దాదాపు రూ.251 పెరిగింది. వెండి ధర కిలో రూ.68,500 దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్ ధనిక క్రికెటర్ ఎవరు?
క్రికెటర్లకు సంబంధించి ఆదాయాలు చెబితే ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు. అయితే మన దేశంలోని క్రికెటర్లలో ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న జాబితా ఇటీవల వెలువడింది. అందులో తొలి స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'హసీన్ దిల్రుబా' రివ్యూ
తాప్సీ (tapsee), విక్రాంత్ మాస్సే ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'హసీన్ దిల్రుబా'(Haseen Dillruba). కరోనా కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. వినీల్ మ్యాథ్యూ దర్శకత్వంలో రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకోవాలంటే ఈ సమీక్షను చదివేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.