ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @7pm - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @7pm
టాప్‌టెన్‌ న్యూస్‌ @7pm
author img

By

Published : May 26, 2021, 6:59 PM IST

  • ప్రతి 10 మందిలో నలుగురికి పరీక్షలు..

రాష్ట్రంలో ప్రతి 10 మందిలో నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కొవిడ్‌ కట్టడికి అన్ని శాఖలు సమష్టిగా కృషిచేస్తున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొత్తగా మరో 3,762 కేసులు..

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి ఈ సాయంత్రం వరకు 91,048 మందికి పరీక్షలు జరపగా.. 3,762 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విధుల్లో చేరండి..

జూనియర్ వైద్యుల సమ్మె పిలుపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే విధుల్లో చేరాలని జూడాలకు సీఎం సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీఎం క్షమాపణ చెప్పాలి..

జూడాల సమ్మెకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. సీఎం సకాలంలో స్పందించి ఉంటే.. జూడాలు సమ్మె చేసేవారే కాదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తొలిదశ అధ్యయనం పూర్తి..

ఆనందయ్య రూపొందించిన కరోనా మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తి చేసింది. నివేదికను ఆన్​లైన్​ ద్యారా పంపారు. మలి దశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అరణ్యంలో ప్రసవం..

ఆ తల్లి పురిటి నొప్పుల బాధను చూసి అడవి నిశ్శబ్దంగా రోధించింది. అభివృద్ధి చెందుతున్న సమాజానికి మహిళ పెడుతున్న అరుపులు వినిపించట్లేదా అని హీనంగా వెక్కిరించింది. ఆ అతివ పడుతున్న యాతన చూడలేక.. తన పచ్చని ఒడిలోనే పండంటి బిడ్డకు ప్రసవం పోసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా 'ల్యాబ్​ లీక్'​పై మరోసారి దర్యాప్తు!

కొవిడ్-19 ఆవిర్భావంపై దర్యాప్తు చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ బృందం చైనాలో మరోసారి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ల్యాబ్​ లీకేజీ సహా పలు కోణాల్లో దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బ్యాంకు​లకు అదనపు సెలవులు..

వచ్చే నెలలో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే ఇప్పుడు బ్యాంక్​ పనుల గురించి ముందే ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే వచ్చే నెలలో పలు ప్రత్యేక కారణాల వల్ల బ్యాంకులు అదనపు సెలవులో ఉండనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రీషెడ్యూల్​కు ఆసీస్ ప్లేయర్లు​ దూరం..

ఐపీఎల్​ రీషెడ్యూల్​ మ్యాచ్​లకు ఆసీస్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మూడో వారంలో మిగతా మ్యాచ్​లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు విండీస్ పర్యటనకు వెళ్లనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రముఖ నటుడు అరెస్టు..

మలయాళ నటుడు ఉన్నీ దేవ్​ను కేరళలోని నేదుమంగాడ్​ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తన భార్య ప్రియాంక ఆత్మహత్య కేసులో భాగంగా విచారణ కోసం ఉన్నీ దేవ్​ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.