- సెకండ్ వేవ్‌తో జాగ్రత్తగా ఉండాలి..
కరోనా మొదటి వేవ్‌కు, రెండో వేవ్‌కు చాలా తేడా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రెండో దశలో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాస్క్ లేకపోతే జరిమానా..
మాస్కు పెట్టుకోకపోతే ఏముంది... నన్ను ఎవరు చూస్తారులే అనుకుంటే... మీరు తప్పులో కాలేసినట్టే!! మీరు మాస్కు పెట్టుకున్నారా...? లేదా? అనే నిఘా మీపై ఉంటుంది. అదేలా అనుకుంటున్నారా..? మాస్క్ లేనివారిని సీసీ కెమెరాలతో గుర్తించి జరిమానా విధిస్తున్నారు రాచకొండ పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైకిల్‌పై సోనూసూద్!
సోనూ సూద్ .. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళ్తుంటే.. వారిని స్వచ్ఛందంగా ఆదుకున్న సోనూసూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సోనూ సూదే హైదరాబాద్‌లో సైకిల్‌పై సందడి చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాగల మూడు రోజులు వర్షాలు..
ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహా అన్ని చోట్లా రాగల మూడు రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, గాలి విచ్ఛిన్నతి వల్లే రాష్ట్రంలో వర్షాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వీహెచ్ దీక్షకు మద్దతు..
పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. అంబర్‌పేటలోని తన నివాసం వద్ద దీక్షకు దిగిన వీహెచ్‌ను.. నేడు పలువురు నేతలు కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా వ్యాప్తికి భాజపా కుట్ర..
భాజపా నేతలు బయటి వ్యక్తులను పెద్ద సంఖ్యలో తీసుకురావడం వల్ల బంగాల్లో కరోనా వ్యాప్తి పెరిగిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. జల్పాయిగుడిలోని ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బంగాల్లో భాజపాకు 70 సీట్లు రావడం కూడా గగనమే అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేరళలో 'విశు' వేడుకలు..
కరోనా నేపథ్యంలో.. కేరళలో కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివెళ్లారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహమ్మారి దృష్ట్యా భక్తులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవాగ్జిన్ డోసులు చోరీ..
జైపుర్‌లోని కన్వాటియా ప్రభుత్వ ఆస్పత్రిలో 320 కొవాగ్జిన్ డోసులు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ భయం వల్లే నా బ్యాటింగ్ ఇలా..
మిడిలార్డర్ తాను బాగా బ్యాటింగ్ చేయడానికి తనుకున్న ఓ భయమే కారణమని మిస్టర్ 360 డివిలియర్స్ చెప్పాడు. ఇంతకీ ఆ భయమేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పవన్‌ను హత్తుకున్న తారక్!
'వకీల్‌సాబ్' సినిమాను హీరో ఎన్టీఆర్ వీక్షించి ప్రశంసించారని తెలిపారు నటుడు ప్రకాశ్‌రాజ్. అనంతరం పవన్‌ను కలిసి హత్తుకున్నారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.