- 9న షర్మిల పార్టీ
ఏప్రిల్ 9న పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల... లక్ష మంది సమక్షంలో పార్టీ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బండి పరామర్శ..
రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. భైంసా అల్లర్లలో హిందూవాహిని కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టిన ఐపీఎస్‌లను వదిలేది లేదని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జైలులో అల్లర్ల బాధితులను పరామర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మూడు షిఫ్టుల్లో కౌంటింగ్..
హైదరాబాద్, నల్గొండలో రేపు నిర్వహించే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ సుధీర్ఘంగా సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు సిబ్బందిని కేటాయించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తిరుపతి ఉపఎన్నికకు షెడ్యూల్..
ఏపీలోని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన..
భైంసా అల్లర్లకు, లవ్ జీహాద్‌లకు వ్యతిరేకంగా కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పార్లమెంట్ ఆమోదం..
24 వారాల అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు ఉద్దేశించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లు-2020 పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఈ బిల్లును మంగళవారం నాడు రాజ్యసభ ఆమోదించగా, 2020లోనే లోక్‌సభ ఆమోదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నలుగురు నక్సల్స్ హతం..
బిహార్, ఝార్ఖండ్ సరిహద్దులో పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యూనివర్సిటీలో ఉద్రిక్తత..
జైపుర్‌లోని రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బోనస్ మార్కులు సహా ఇతర సమస్యలపై ఏబీవీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధోనీ ఫిట్‌నెస్‌పై సీఎస్కే కోచ్ ఏమన్నాడంటే..
మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్‌నెస్‌పై స్పందించాడు చెన్నై జట్టు ఫీల్డింగ్ కోచ్ రాజీవ్ కుమార్. 40 ఏళ్ల వయసులోనూ బంతిని చక్కగా అంచనా వేయగలడని కొనియాడాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏప్రిల్‌లో లూసిఫర్ షూటింగ్..
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 'లూసిఫర్' తెలుగు రీమేక్ వచ్చేనెలలో పట్టాలెక్కనుంది. చిరు నటిస్తున్న 'ఆచార్య' సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకోవడం వల్ల ఏప్రిల్‌లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.