ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @7PM
టాప్​టెన్​ న్యూస్​ @7PM
author img

By

Published : Mar 8, 2021, 7:00 PM IST

Updated : Mar 8, 2021, 7:19 PM IST

  • ఆజాదీ కా అమృత్ మహోత్సవ్..

రాష్ట్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. ఈనెల 12 నుంచి 2022 ఆగస్టు 15 వరకు ఉత్సవాలు75 వారాలపాటు జరగనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎందుకు బయటికి రారు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చర్యలు తీసుకోవాలి..

గ్యాంగ్​స్టర్ నయీం కేసు దర్యాప్తుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని... కేంద్రం ఆదేశించింది. నయీం కేసు సీబీఐకి అప్పగించాలంటూ ప్రధానికి సుపరిపాలన వేదిక కన్వీనర్‌ పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పోలవరం పనుల పూర్తి అప్పుడే..

పోలవరం నిర్మాణ పనులపై రాజ్యసభలో కేంద్రం వివరణ ఇచ్చింది. పోలవరం పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పూర్తవుతాయని తెలిపింది. తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి కటారియా లిఖితపూర్వక జవాబిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ ఆరు రాష్ట్రాల నుంచే..

భారత్​లో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 86 శాతం.. ఆరు రాష్ట్రాల్లోనే వెలుగుచూస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిల్లో మహారాష్ట్ర ముందువరుసలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు 18 రాష్ట్రాల్లో కరోనా మరణాల సంఖ్య సున్నాకు పరిమితమైనట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్​ నుంచి 3.3 కోట్ల టీకాలు..

కొవాక్స్​ కార్యక్రమంలో భాగంగా భారత్​ ఇప్పటివరకు 3.3 కోట్ల డోసులను పేద దేశాలకు అందించిందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. భారత్​... ప్రపంచానికే టీకా హబ్​గా ఏర్పడాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దీదీకి షాక్..

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల వేళ టీఎంసీ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరి మమతకు షాక్​ ఇచ్చారు. బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో వారు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దినకరన్​తో ఓవైసీ​ పొత్తు..

అసదుద్దీన్​ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎంతో పొత్తు కుదుర్చుకున్నారు టీటీవీ దినకరన్​. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరి పొత్తు ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సత్తా చాటేనా..?

తొలి మ్యాచ్​లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసిన భారత మహిళల జట్టు గాడిన పడేందుకు యత్నిస్తోంది. అయితే మంగళవారం జరగనున్న రెండో వన్డేకు కొత్త వాళ్లను తీసుకునే అవకాశం ఉంది. లఖ్​నవూ వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సినిమా కబుర్లు..

యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్​ కే కుమార్​ కాంబోలో రూపొందుతోన్న కొత్త చిత్రం 'థ్యాంక్​ యూ'. ఇందులో చైతన్య.. సూపర్​స్టార్​ మహేశ్​బాబు అభిమానిగా కనిపించనున్నారని సోషల్​మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా మహేశ్​బాబు కటౌట్​కు నాగచైతన్య పాలాభిషేకం చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Mar 8, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.