ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@ 7PM - ts news in Telugu

ఇప్పటి వరకున్న ప్రధాన వార్తలు...

top ten news @ 7pm
top ten news @ 7pm
author img

By

Published : Sep 19, 2020, 6:59 PM IST

మేము వ్యతిరేకం...

ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు స్పష్టం చేశారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా.. కార్పొరేట్లకు మేలు చేసేలా కేంద్రం బిల్లులు తీసుకొచ్చిందని దిల్లీలో ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అందులో తెలంగాణ భేష్​...

రాష్ట్రంలో కొవిడ్​ మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం కరోనాను చాలావరకు అదుపు చేయగలిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 12 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్​ కార్యదర్శి రాజీవ్ గౌబ, కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​ దృశ్యమాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. రాష్ట్రాల్లో కొవిడ్​ నియంత్రణ చర్యలపై సమీక్ష జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మూడు రోజులు వర్షాలంటా...

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సాగర్​ సోయగం....

ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్​కు వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4,49,433 క్యూసెక్కుల ఇన్​ఫ్లో రావడం వల్ల నాగార్జునసాగర్ జలాశయం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సెల్ఫీ దిగేందుకు వెళ్లి...

ఏళ్ల తర్వాత వాగు నిండుగా ప్రవహించడాన్ని చూసేందుకు జనాలు గుంపులుగా తరలివచ్చారు. కొందరు యువకులు ఉత్సాహంతో అందులో ఈత కొడుతూ సెల్పీలు దిగారు. ఓ యువకుడు సైతం సెల్ఫీ దిగేందుకు యత్నించి వాగు ఉద్ధృతికి బలయ్యాడు. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలోని లింగంపేట సమీపంలోని దుందుభి వాగులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

97మంది కూలీలు మృతి

కరోనా కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ సమయంలో శ్రామిక్​ ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రయాణించిన వలస కార్మికులలో మొత్తం 97మంది మృతి చెందినట్లు పార్లమెంట్​ తెలిపింది. ఈ మేరకు ఓ రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చింది కేంద్రం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వచ్చేవారమే మూడో దశ

ఆక్స్​ఫర్డ్​ అభివృద్ధి చేస్తున్న 'కొవిషీల్డ్​' వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​.. భారత్​లో వచ్చేవారం ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ భాగస్వామి అయిన సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా ఈ ట్రయల్స్​ను నిర్వహించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈసారి టాప్ లేచిపోద్ది!

ఐపీఎల్ ప్రారంభానికి ముందు మాట్లాడిన లీగ్​ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్.. ఈసారి వ్యూయర్​షిప్ చాలా ఎక్కువగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రేక్షకులను అనుమతి లేకపోవడం వల్ల అందరూ లైవ్ చూస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

షారుక్ ఖాన్​​ స్పెషల్​ హగ్​

చెన్నై-ముంబయి జట్లకు ఆల్​ ది బెస్ట్ చెప్పిన షారుక్ ఖాన్.. ఆరుడగుల దూరం నుంచి వారిని హగ్​ చేసుకుంటున్నానని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ రీమేక్​లో నితిన్​తో...

హీరో నితిన్ కొత్త సినిమాలో నభా నటేష్, తమన్నా కథానాయికలుగా నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.