ఉత్సవానికి వేళాయె!
సెప్టెంబర్ 10 నుంచి వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. 19 తేదీన నిమజ్జనం ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాన కార్యదర్శి వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొత్త మొక్క
అనంతగిరి కొండల్లో కొత్త జాతి మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్తరకం మొక్కకు బ్రాకిస్టెల్మా అనంతగిరియెన్సే అని నామకరణం చేశారు.
అనంతగిరి అడవుల్లో కేవలం 3 చ.కి.మీ. విస్తీర్ణంలోనే కొత్త జాతి మొక్కలు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నేడు, రేపు భారీ వర్షాలు
ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు, రేపు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గడువు ముగిసినా దొరకడం లేదు.!
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. వారానికి ఐదు రోజులే కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తుండటం... మరోవైపు 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తామని కేంద్రం ప్రకటించటంతో.. ప్రైవేటులోనూ టీకాలు తీసుకునే వారి సంఖ్య తగ్గటంతో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వేగం తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'సచివాలయంలో అవి నిషేధం'
సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఉత్తర్‌ప్రదేశ్ సచివాలయం జాయింట్ సెక్రటరీ నరేంద్ర కుమార్ మిశ్రా. గౌరవప్రదమైన దుస్తుల్లోనే వారు రావాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సిద్ధూకే పగ్గాలు!
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆ రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఇచ్చేందుకు మార్గం సుగమమైందా? తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోన్న ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెనక్కి తగ్గారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బెదిరించి ఎత్తుకెళ్లారు..!
మణిరూపమ్ గోల్డ్ దుకాణంలో సిబ్బందిని తుపాకులతో బెదిరించి చోరీ చేశారు దుండగులు. క్షణాల్లోనే 17 కిలోల బంగారం, రూ.5 లక్షలు లూటీ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మాల్‌వేర్ మళ్లీ..!
గత కొంత కాలంగా ప్లేస్టోర్‌లోని యాప్‌లపై ఓ మాల్‌వేర్ దాడి చేస్తోంది. సాంకేతిక నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తున్న ఈ మాల్‌వేర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. యూజర్స్ అలాంటి యాప్‌లను తమ ఫోన్ల నుంచి తొలగించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఒలింపిక్స్ వద్దు
కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ టోక్యోలో ఒలింపిక్స్‌ను నిర్వహించడంపై మండిపడుతున్నారు అక్కడి ప్రజలు. మరో వారం రోజుల్లో పోటీలు ప్రారంభమవబోతున్న నేపథ్యంలో కొందరు ఒలింపిక్స్ విలేజ్ దగ్గర నిరసన ప్రదర్శనకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బాలయ్యకు నాగబాబు కౌంటర్!
'మా' ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నటుడు నాగబాబు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి కాదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.