ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 5 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5 PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5 PM
author img

By

Published : Jul 1, 2021, 4:59 PM IST

అది సీఎం ఘనతే

ఇంటింటికి నల్లా ఇచ్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజుపేటలో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లాభాపేక్ష లేని ఆస్పత్రి మాది

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​ బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీనటుడు, బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. సమాజానికి డాక్టర్లు అందించే సేవలు ఎనలేనివంటూ కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రామోజీ ఫౌండేషన్​కు కృతజ్ఞతలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​స్టేషన్​ నూతన భవనానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రామోజీ ఫౌండేషన్​ సహకారంలో ఈ పీఎస్​ను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం తరఫున రామోజీ ఫౌండేషన్​కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు కృతజ్ఞతలు తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

చేతబడి నెపంతో భార్యనే.!

తన అనారోగ్యానికి భార్యే కారణమనుకున్నాడు. ఆమె మంత్రాలు చేయటం వల్లే.. తన ఆరోగ్యం దెబ్బతింటోందని అనుమానం పెంచుకున్నాడు. తనను హతమార్చాల్సిందేనని నిశ్చయించుకుని.. అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం నర్సింగాపూర్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' విపత్తు వేళ వారి సేవలు భళా!'

కరోనాపై పోరులో వైద్యుల కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మహమ్మారిపై విజయం సాధించడంలో వారి అనుభవాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. వైద్య రంగ బడ్జెట్​ను రెట్టింపు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రేమించిందని కన్నతండ్రే.!

ఆమె ఓ యువకుడ్ని ప్రేమించింది. పుట్టింటివారు వారించినా పెళ్లి చేసుకుంది. అందరికీ దూరంగా మరో ఊర్లో ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది. ఆర్నెల్ల తర్వాత తల్లితండ్రుల మీద ప్రేమతో పుట్టింటికి వచ్చింది. తన నిర్ణయాన్ని కాదన్నందుకు కూతురిపైనే తండ్రి కక్షకట్టాడు. కాలయముడిలా మారాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉయ్యాల ఊగుతూ ముగ్గురు మృతి!

సరదాగా ఆడుకోవాల్సిన వయసులో.. ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. కర్ణాటకలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలతో.. ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రపంచంలోనే ఖరీదైన కారు-

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల కార్లు ఉన్నాయి. మామూలు కార్లు లక్షలు పలుకుతుంటే విలాసవంతమైనవి కోట్లు విలువ చేస్తాయి. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏదో తెలుసా? దాని ధర ఎంత ఉంటుందో ఊహించగలరా? రోల్స్​ రాయిస్​ సంస్థ కేవలం ముగ్గురు కస్టమర్ల కోసం తయారు చేసిన ఆ కారు వివరాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆసీస్ ఆటగాళ్లు వచ్చేస్తున్నారు

ద్వైపాక్షిక సిరీస్​ల కారణంగా యూఏఈలో జరగబోయే ఐపీఎల్​ మిగిలిన మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనడం అనుమానం అంటూ వార్తలు వచ్చాయి. అయితే అదే యూఏఈలో టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తుండటం వల్ల లీగ్​కు రావడమే మంచిదని భావిస్తున్నారట ఆసీస్ క్రికెటర్లు. అదే బాటలో ఇంగ్లాండ్​ ఆటగాళ్లు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్త సినిమాల అప్​డేట్

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఫహాద్​ ఫాజిల్​ 'మాలిక్'​ ఓటీటీ రిలీజ్​తో పాటు పునీత్​ రాజ్​కుమార్​, తేజా సజ్జాల కొత్త సినిమా టైటిల్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.