ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

author img

By

Published : Jul 13, 2021, 2:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 3PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 3PM

రాష్ట్ర కేబినెట్​ భేటీ

ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. జోనల్ విధానంలో మార్పులు, చేర్పులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. భూములు, రిజిస్ట్రేషన్ల ధరల పెంపు, పలు అంశాలపై మంత్రి వర్గంలో చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' వాటిపై ఓ కన్నేసి ఉంచాలి'

కరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్​ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కొవిడ్​ పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కాంగ్రెస్​ గూటికి కీలక నేతలు..!

హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని.. ధర్మపురి సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌, గండ్ర సత్యనారాయణ రావు కలిశారు. రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. తాము కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దిల్లీలో అధిష్ఠానం సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అందువల్లే అంతర్జాతీయ పెట్టుబడులు

పెట్టుబడుల ఆకర్షణకు ఇతర రాష్ట్రాలతో పోటీపడుతున్నామని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. సింగపూర్‌ పెట్టుబడుల కోసం ప్రత్యేక హబ్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సాక్ష్యాలుంటే ఇవ్వండి..!

ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్ష్యాలుంటే సీబీఐకి ఇవ్వాలని... ఆయన కుమార్తె సునీత, కేంద్ర గ్రీవెన్స్ సెల్​కు కడప న్యాయవాది సుబ్బారాయుడు లేఖ రాశారు. ఈ లేఖపై ఆమె పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వివేకా హత్యకేసులో 37వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు ఐదుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తొలి కరోనా రోగికి మరోసారి పాజిటివ్

దేశంలోని తొలి కరోనా రోగికి మరోసారి వైరస్​ సోకింది. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. గతేడాది జనవరిలో చైనా నుంచి సెలవుల నిమిత్తం భారత్​కు వచ్చిన విద్యార్థినికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ టీకా తీసుకుంటే అరుదైన వ్యాధి!

జాన్సన్​ టీకాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ టీకాకు నూతన హెచ్చరిక జారీచేసింది అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ. ఈ వ్యాక్సిన్​ తీసుకున్నవారు అరుదైన నాడీ సంబంధ రుగ్మత బారినపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ బైక్​ కొనాలనుకునే వారికి షాక్!

దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఒక్కొక్కటిగా తమ వాహనాల ధరలు పెంచుతున్నాయి. ఇప్పటికే బజాజ్ ఆటో, మారుతీ, మహీంద్రా వంటి కంపెనీలు తమ వాహనాల ధరలు పెంచగా.. ఈ జాబితాలో ఇప్పుడు రాయల్ ఎన్​ఫీల్డ్ చేరింది. మోడళ్ల వారీగా రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​ల ధరల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్తగా 'ది హండ్రెడ్​ లీగ్'

క్రికెట్​లో సరికొత్త అధ్యాయానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెరలేపనుంది. ప్రారంభ ఎడిషన్ 'ది హండ్రెడ్​ లీగ్'​కు సంబంధించి ఆట నిబంధనలు విడుదల చేసింది. అవేంటో మీరూ తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హీరో విజయ్​కు జరిమానా

తమిళ హీరో విజయ్​కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశం నుంచి ఓ లగ్జరీ కారును దిగుమతి చేసుకోగా.. దానికి పన్ను మినిహాయింపు కోసం 2012లో మద్రాస్​ హైకోర్టులో పిటిషన్​ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సదరు నటుడిపై జరిమానా విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.