కొత్త మంత్రులతో రంగంలోకి మోదీ!
కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన మరుసటి రోజే కొత్త మంత్రులను కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురువారం.. కేంద్ర విద్యాసంస్థల డైరక్టర్లతో ఆయన నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పునర్వైభవం తెస్తా
పక్కా ప్రణాళికలతో.. కొవిడ్ వల్ల కుదేలైన పర్యాటక రంగానికి పూర్వవైభవం తీసుకువస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన ఆయన.. తనకు కేటాయించిన శాఖల బాధ్యతల్ని చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నాకు డబ్బు బలం లేదు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ షర్మిల పార్టీ ప్రకటనపై స్పందించారు. ఆమెకు స్వాగతం చెబుతున్నానన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు రావాలన్న పవన్.. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గోడ కూలి విద్యార్థి మృతి
బుధవారం సాయంత్రం 6.30 నిముషాల నుంచి గురువారం ఉదయం 10.30 అతను అక్కడే ఉన్నాడు. అతని ఉనికి ఎవరైనా గమనించి ఉంటే ప్రాణాలు నిలిచేవేమో..! కానీ మృత్యువు గోడ రూపంలో అంటిపెట్టుకుని అక్కడే సమాధి చేసేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీబీఐ భవనంలో షార్ట్ సర్క్యూట్
దిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) భవనంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. జనరేటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల పొగ కమ్ముకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'8 వారాల్లో నియమిస్తాం'
చీఫ్ కంప్లయన్స్ అధికారి నియామకంపై దిల్లీ హైకోర్టుకు వివరణ ఇచ్చింది ట్విట్టర్. మరో 8 వారాల్లోగా అధికారిని నియమిస్తామని స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మహిళకు జాక్‌పాట్!
అమెరికా కొలరాడో రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు జాక్‌పాట్ తగిలింది. వ్యాక్సిన్ లాటరీలో(Vaccine lottery) 1 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.7.45కోట్లు) గెలుచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారత్‌కు ఎదురుదెబ్బ
రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పారిస్‌లోని భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీకి అనుమతులు లభించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఒలింపిక్స్ జరిగేనా?
ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్ టోక్యో నగరంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సూపర్‌స్టార్ మెచ్చిన మేకప్‌మ్యాన్
ప్రముఖ మేకప్‌మ్యాన్ పట్టాభి.. తనకు తెలిసిన ఉత్తమ మేకప్‌మ్యాన్ అని ట్వీట్ చేశారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. పట్టాభి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేశ్ పోస్ట్ పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.