ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 3PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 3PM
author img

By

Published : Jul 4, 2021, 3:01 PM IST

ప్రారంభోత్సవాలతో కేసీఆర్​ బిజీ బిజీ..

మంత్రి కేటీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న రెండు పడక గదుల ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పరిపాలన సౌలభ్యం, ఉపాధిమార్గాలను చూపే పలు సంస్థలను సీఎం జాతికి అంకితం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉగ్రవాదులకు నివాసంగా మహానగరం..!

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే భాగ్యనగరం ఉగ్రవాదులకు నివాసంగా మారుతోంది. పలువురు ఏళ్ళ తరబడి ఇక్కడే తిష్టవేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నా.. పోలీసులు పసిగట్టలేకపోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నగరంలో అడుగడుగునా సీసీటీవీలు, సమర్ధవంతమైన పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ... ఉగ్రవాదులను పట్టుకోలేకపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆనాడే హెచ్చరించా.!

పోతిరెడ్డిపాడు మీద మొదట పోరాటం చేసింది... అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొట్లాడింది... పి.జనార్దన్‌ రెడ్డినేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. పోతిరెడ్డిపాడు తెలంగాణ పట్ల మరణశాసనమని ఆనాడే పీజేఆర్‌ హెచ్చరించారన్నారు. పీజేఆర్​ చనిపోయిన తరువాత తెలంగాణ తరపున బలంగా పోరాడే నేత లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాష్ట్రవ్యాప్తంగా భాజపా పాదయాత్ర

కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఆగస్టు 9న రాష్ట్రవ్యాప్తంగా మహాపాదయాత్ర చేపడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BANDI SANJAY) తెలిపారు. హుజూరాబాద్​లో తెరాసను ఓడించి, ఈటలను (Etela) గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనా అడ్డుకున్నా ఒక్కటయ్యారు.!

దేశాలు వేరైనా, అభిరుచులు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాల పెద్దలను పెళ్లికి ఒప్పించారు. ఇక పెళ్లికి ముహూర్తమే ఆలస్యమనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి విలన్​ రూపంలో వారి పెళ్లికి అడ్డంకిగా మారింది. విదేశాలకు రాకపోకల విషయంలో ఆంక్షలు విధించినా.. అన్ని అవరోధాలను దాటుకొని మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది ఈ జంట. అదెలాగంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇండియా మ్యాప్​తో ట్విట్టర్​ ఆటలు!

సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ మరోసారి తన వెబ్‌సైట్‌లో భారత దేశం పటాన్ని వక్రీకరించి ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్​ను భారత్​లో అంతర్భాగంగా కాకుండా విడదీసి చూపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విమానం కూలి 17మంది మృతి

ఫిలిప్పీన్స్​లో విమానం కూలిన ఘటనలో 17 మంది మృతి చెందారు. 40 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బీమాతో ధీమా

సొంతిల్లు.. చాలా మందికి చిరకాల స్వప్నాల్లో ఒకటి. ఇందుకు తగినంత డబ్బు లేకపోయినా.. గృహ రుణం ద్వారా చాలా మంది తమ కలను నిజం చేసుకుంటారు. అయితే గృహ రుణం తీసుకున్నాక అనుకోని పరిస్థితుల వల్ల రుణ గ్రహీత మరణించిన లేదా సంపాదించ లేని స్థితికి వచ్చినా.. ఇల్లు కోల్పోవడమో లేదా కుటుంబ సభ్యులపై ఆర్థికంగా భారం పడటమో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా రుణ బీమా.. కుటుంబానికి ధీమానిస్తుంది. మరి బీమా ఎలా పని చేస్తుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారి బౌలింగ్ అద్భుతం

టీమ్ఇండియా(Team India) పేస్​ బౌలింగ్​ పటిష్ఠంగా ఉందంటూ ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ చాపెల్(Ian Chappell)​ అభిప్రాయపడ్డాడు. పేస్ బౌలింగ్ నైపుణ్యం కలిగిన జట్ల సరసన కోహ్లీసేన చేరిందని పేర్కొన్నాడు. ​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆయనతో స్టార్​ హీరోయిన్​ డేటింగ్​?

'కేదార్​నాథ్​' సినిమాకు అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేసిన జహన్​ హండాతో బాలీవుడ్​ హీరోయిన్​ సారా అలీఖాన్​ డేటింగ్​లో ఉన్నట్లు సమాచారం. తామిద్దరు గతంలోని హాలీడేలో గడిపిన ఫొటోలను జహన్​ ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేయగా.. దానికి సారా ప్రేమగా రిప్లే ఇచ్చింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.