ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 3PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 3PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 3PM
author img

By

Published : Jun 29, 2021, 3:00 PM IST

జులైలో పార్లమెంట్​ సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ.. ఈమేరకు తేదీలు సిఫార్సు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఎండీపై కేసు

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపిస్తూ ట్విట్టర్​ తన వెబ్​సైట్​లో తప్పుడు మ్యాప్​ ప్రదర్శించడంపై ఆ సంస్థ ఎండీ మనీశ్‌ మహేశ్వరిపై మరో కేసు నమోదైంది. భజరంగ్​దళ్​ కార్యకర్తల ఫిర్యాదు మేరకు ఉత్తర్​ప్రదేశ్​లోని ఖుజ్రానగర్‌ పోలీసు స్టేషన్‌లో ఆయనపై అధికారులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారికి ఫ్రీగా ఇవ్వాల్సిందే.!

కేంద్ర ప్రవేశపెట్టిన ఉద్దీపన ప్యాకేజీపై కాంగ్రెస్​ నేతలు రాహుల్​ గాంధీ, చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ ప్యాకేజీ ద్వారా కేంద్రం మరోసారి మోసానికి పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రజలకు నగదు పంపిణీ చేయమడమే పరిష్కారమని చిదంబరం సూచించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'సెంట్రల్ విస్టా'పై కీలక నిర్ణయం

సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​పై దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొందరు కావాలనే ఈ పిటిషన్లు వేస్తున్నట్లు కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ధిక్కరణ నోటీసులు

తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ధిక్కరణ నోటీసులు పంపింది. విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వట్లేదంటూ... 84మంది ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వివాదంలో ప్రముఖ నిర్మాత

ప్రముఖ సినీ నిర్మాత సి కళ్యాణ్‌(C Kalyan)తో పాటు మరో ముగ్గురిపై హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ ప్రవాస భారతీయ వైద్యునికి చెందిన స్థలాన్ని ఆక్రమించారని... గోపీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తెలుగోడి సత్తా.!

అమెరికాలో నిర్వహించే ప్రతిష్టాత్మక స్పెల్లింగ్​ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఫైనల్స్​కు ఎంపికైన మొత్తం 11 మంది విద్యార్థుల్లో 9 మంది భారత సంతతికి చెందిన వారే ఉండటం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఎస్​బీఐ ఛార్జీల మోత

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ.. వివిధ సేవలకు వసూలు చేసే ఛార్జీల్లో భారీ మార్పులు చేసింది. ఇకపై వినియోగాదారులు ఏటీఎం ద్వారా 4 లావాదేవీలను మాత్రమే ఉచితంగా వినియోగించుకునేలా నిబంధన విధించింది. ఆపై లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయనుంది. చెక్​బుక్​పై కూడా పలు పరిమితులు విధించింది. ఈ కొత్త ఛార్జీల పూర్తి సమాచారంతో పాటు, ఎప్పటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి అనే వివరాలు మీ కోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

క్రికెటర్లకు విరామం

టీమ్‌ఇండియా(Team India) క్రికెటర్లు కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. దొరికిన విరామాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. బ్రిటన్‌లోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులతో తమకు నచ్చిన ప్రాంతాల్లో విహరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కూ యాప్​లో అనుష్క

సామాజిక మాధ్యమాల్లో అంతగా కనిపించని నటి అనుష్క శెట్టి(Anushka Shetty).. ఇటీవల 'కూ' యాప్‌లో చేరింది. వారంలోపే దాదాపు పాతికవేల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అనుష్క శెట్టి ప్రేమ గొప్పతనాన్ని చెప్తూ ఒక పోస్టు చేసింది. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.