ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @3PM
టాప్​టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Mar 9, 2021, 2:59 PM IST

  • ముఖ్యమంత్రి మార్పు ఖాయం!

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​పై భాజపా నేతలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉభయ సభలు వాయిదా..

చమురు ధరలపై పార్లమెంటు రెండో రోజూ దద్దరిల్లింది. ఈ విషయంపై చర్చ జరపాలని విపక్షాలు చేపట్టిన ఆందోళనల నడుమ లోక్​ సభ, రాజ్య సభ రెండు సార్లు వాయిదా పడ్డాయి అనంతరం సభలు తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • త్వరలోనే నోటిఫికేషన్..

త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆరున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని, మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి పోగొట్టామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అత్యాచార దోషికి జీవితఖైదు..

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో దోషికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. కుమారుడికి సహకరించిన తల్లికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కిషన్‌రెడ్డి డిమాండ్‌..

సంఘ విద్రోహ శక్తులే భైంసాలో ఘర్షణలకు కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి వెల్లడించారు. హింసను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తప్పుడు ఓట్లు వేయొద్దు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ తప్పుడు ఓట్లు వేయొద్దని తెజస అధ్యక్షుడు కోదండరాం విజ్ఞప్తి చేశారు. తెరాస సర్కార్ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరోసారి జగన్‌ లేఖ..

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఉక్కును వందశాతం ప్రైవేటీకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ఆ రాష్ట్ర సీఎం జగన్‌ భావిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీని సమయం కోరుతూ నాలుగు పేజీల లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నయా యుద్ధనీతి అవసరం..

భారత భద్రతా దళాలు సరికొత్త యుద్ధనీతిని అనుసరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ. ప్రస్తుత వ్యూహాలకు కాలం చెల్లిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అశ్విన్​కు అవార్డు..

ఫిబ్రవరి నెలకుగానూ ప్లేయర్​ ఆఫ్ ది మంత్​ అవార్డును ప్రకటించింది ఐసీసీ. భారత ఆఫ్ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మహిళల విభాగంలో ఇంగ్లాండ్​ బ్యాట్స్​ఉమెన్​ బ్యూమంట్​ ఈ అవార్డుకు ఎంపికైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'లూప్ లాపెటా' విడుదల ఖరారు..

తాప్సీ హీరోయిన్​గా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'లూప్ లాపెటా'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.