ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @3PM
టాప్​టెన్ న్యూస్ @3PM
author img

By

Published : Jan 31, 2021, 2:56 PM IST

1. మోదీ మెచ్చిన మన మార్కెట్

మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో బోయిన్‌పల్లి మార్కెట్‌పై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. పాడైపోయిన కూరగాయల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. ప్రతిరోజూ 10 టన్నుల చెత్త నుంచి 500 యూనిట్ల విద్యుత్‌, 30 కేజీల బయో ఫ్యూయల్‌ ఉత్పత్తి చేస్తున్నారని ప్రధాని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ట్రామాకేర్​ సెంటర్​గా శామీర్​పేట్

శామీర్​పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లలు 38 లక్షల మందికి పైగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. శామీర్​పేట ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. అక్కాచెల్లెల్లు

కళలు.. సమాజంలో మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మన ప్రతిభాపాటవాలను పదిమందికి తెలియజేస్తాయి. లలితకళల్లో ప్రసిద్ధి చెందిన కూచిపూడికి మంచి గుర్తింపు ఉంది. కాకపోతే క్రమేణా ఆ ఆదరణ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలోనే మన సంస్కృతికి చిరునామాగా నిలిచే కూచిపూడికి పునర్వైభవం కోసం తమ వంతు కృషి చేస్తోంది..ఈ నాట్య బృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అఖిలపక్షం భేటీ..

రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. బడ్జెట్ సమావేశాలు, సభా కార్యకలాపాలపై నేతలు చర్చించారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చించాలని భేటీలో నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. టీకా పంపిణీలో భారత్ రికార్డ్

దేశంలో కొవిడ్​ మహమ్మారిని అంతం చేసే దిశగా చేపట్టిన వ్యాక్సినేషన్​ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. ఇప్పటి వరకు 37 లక్షల మందికి టీకా వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా పంపిణీ విషయంలో అమెరికా, బ్రిటన్​ వంటి దేశాలను వెనక్కి నెట్టి కొత్త రికార్డులను భారత్​ నమోదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పాక్​కు చైనా వ్యాక్సిన్​..?

కరోనా వాక్సిన్ పంపిణీకి పాకిస్థాన్​ ఏర్పాట్లు ప్రారంభించింది. చైనాకు ఓ ప్రత్యేక విమానాన్ని పంపనున్నట్లు ఆ దేశ ఎన్​సీఓసీ తెలిపింది. చైనాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 5 లక్షల టీకా డోసులు తీసుకొచ్చేందుకు విమానం పంపుతున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. చెప్పులేసుకుంటే..

చెప్పులు వేసుకుంటే లక్షల రూపాయల్లో వేతనం అందిస్తామంటోంది ఓ అంతర్జాతీయ వ్యాపార సంస్థ. తాము తయారు చేసిన చెప్పులు ఎలా ఉన్నాయో అనుభవపూర్వకంగా పరిశీలించి ఓ నివేదిక ఇస్తే చాలంటోంది. జనవరి 31తో గడువు ముగుస్తోంది. మరి త్వరపడండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. భారతేే నా ఫెవరేట్​..

ఫిబ్రవరి 5 నుంచి జరుగబోయే టెస్టు సిరీస్​లో భారత జట్టే ఫెవరేట్​ అని ఆసీస్ మాజీ కెప్టెన్​ ఇయాన్​ చాపెల్​ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్​ జట్టు టాప్​ ఆర్డర్​తో పోల్చితే ఇండియానే బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే బౌలింగ్​, మిడిల్​ ఆర్డర్​ విభాగాల్లో దాదాపు సమానంగా ఉన్నాయని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కోహ్లీని ఎలా ఔట్ చేయాలి..?

భారత్​తో టెస్టు సిరీస్​లో విరాట్​ కోహ్లీని ఎలా ఔట్​ చేయాలో తెలియడం లేదని.. ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ మొయిన్​ అలీ తెలిపాడు. పితృత్వ సెలవులతో ఆస్ట్రేలియా సిరీస్​ విజయంలో లేని అతడు.. ఈ సిరీస్​లో దూకుడుగా బ్యాటింగ్​ చేస్తాడని భావిస్తున్నట్లు చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. మహేశ్​కు నచ్చిన నగరం

'సర్కారు వారి పాట' సినిమా చిత్రీకరణ కోసం దుబాయ్​ వెళ్లిన హీరో మహేశ్​ బాబు.. ఆ ప్రాంతమంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. గతంలోనూ పలు సార్లు ఆ నగరాన్నిసందర్శించినట్లు వెల్లడించారు. కాగా, ఈ చిత్రంలో కీర్తి సురేశ్​ హీరోయిన్​గా నటిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.