- లంకెబిందెల్లో 5 కిలోల బంగారం..
జనగామ జిల్లా పెంబర్తిలో లంకెబిందెలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన నర్సింహా అనే రైతు తన భూమిని చదును చేస్తుండగా లంకె బిందెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందులో సుమారు 5 కిలోల బంగారం ఉండటంతో రైతు అవాక్కయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హైకోర్టు అసంతృప్తి..
కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై వైద్యారోగ్యశాఖ, కరోనా మార్గదర్శకాల అమలుపై డీజీపీ వేర్వేరుగా నివేదికలు సమర్పించగా.. హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిధుల కొరత వల్లే..
గోల్నాక నుంచి రామంతపూర్ వరకు ఫ్లైఓవర్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. వాహనాల రద్దీని తగ్గించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా, జీహెచ్ఎంసీ నిధుల కొరత కారణంగా ఆలస్యం అయిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 500 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం..
ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో రెండేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 14 ఏళ్ల బాలుడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీపంలోని నందగ్రామ్‌లో ఓ మహిళపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫుట్‌పాత్ దుకాణాదారుల కొట్లాట..
చార్మినార్ వద్ద ఫుట్‌పాత్ దుకాణాదారులు దాడులు చేసుకున్నారు. స్థలం విషయంలో తలెత్తిన గొడవ కారణంగా రెండు వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 11 గంటలకు పోలింగ్ శాతమిలా..
ఏపీవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల ఓటర్లు బారులు తీరగా.. మరికొన్ని ప్రాంతాల్లో పెద్దగా స్పందన లేదు. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 21.65 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేను బాధ్యుడిని కాదు..
జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలకు తాను కారకుడిని కానని దిల్లీ కోర్టుకు తెలిపారు పంజాబీ నటుడు దీప్ సిద్ధూ. ఆందోళనకు రైతు సంఘాలే పిలుపునిచ్చాయని పేర్కొన్నారు. ట్రాక్టర్ ర్యాలీని ఎర్రకోట వైపు తాను మళ్లించలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగ్లాదేశ్ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్..
భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే.. ఐదు రోజుల బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య సహాయ, సహకారాల్ని మరింత విస్తరించడం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా.. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఈ పర్యటన సాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బయోబబుల్‌లో ఇవి పాటించాల్సిందే!
ఇండియన్ ప్రీమియల్ లీగ్ (ఐపీఎల్) శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. దేశంలో ఒకవైపు కరోనా కేసులు నానాటికి పెరుగుతోన్న నేపథ్యంలో బయోబబుల్‌లో ఉంటున్న ప్రతిఒక్కరూ బీసీసీఐ విధించిన నిబంధనలను తప్పక పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలేమిటో మీరు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శుభాకాంక్షల వెల్లువ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినీప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పరాజ్ టీజర్ అద్భుతంగా ఉందంటూ వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'అల్లు అర్జున్ తగ్గేదే లే!' అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.