అన్నీ అవకతవకలే...
డబుల్ బెడ్ రూం ఇళ్ల జాబితా మొత్తం తప్పుల తడఖాగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నాంపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టటం లేదని పేర్కొన్నారు. మంత్రి ఇచ్చిన జాబితాలో అనేక అవకతవకలున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గాంధీలో ఆందోళన...
గాంధీ ఆస్పత్రిలో ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి ఆస్పత్రి ఆవరణలో బైఠాయించారు. మూడు నెలలు దాటినా జీతాల పెంపు హామీ అమలు కాలేదని నిరసన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కల్పవృక్షంపై శ్రీవారు...
తిరుమల శ్రీనివాసుడు కల్పవృక్షంపై దర్శనమిచ్చారు. బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సతీసమేతంగా కల్పవృక్ష వాహనంపై కోనేటిరాయుడు కొలువుదీరారు. భక్తులను తన దివ్యమోహన స్వరూపంతో అనుగ్రహించారు. ఎంత చూసినా తనివి తీరదనిపించేలా కొనసాగిన ఏడుకొండలవాడి వేడుక.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
విపక్షాల వాకౌట్...
ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని రాజ్యసభలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అప్పటివరకు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్ వెంట విపక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలిచి సభ నుంచి వాకౌట్ చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
డిప్యూటీ ఛైర్మన్ ఉపవాసం...
సెప్టెంబర్ 20న రాజ్యసభలో కొంతమంది విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు తనకు అత్యంత బాధ కలిగించిందని పెద్దల సభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ అన్నారు. వారి అనుచిత ప్రవర్తనకు నిరసనగా 24 గంటలపాటు ఉపవాసం ఉంటున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నిత్యావసరాల బిల్లుకు గ్రీన్‌సిగ్నల్...
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో నిత్యవసర వస్తువుల సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిపాయ, బంగాళాదుంపలు వంటి ఉత్పత్తులను నిత్యవసర వస్తువుల జాబితా నుంచి తొలగించాలని సవరించిన ఈ చట్టం చెబుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భవనం కుప్పకూలింది...
గుజరాత్‌లోని ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రెండు భూకంపాలు...
అసోంలో స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టరు స్కేలుపై 4.4 తీవ్రత నమోదైంది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోనూ స్వల్పంగా భూమి కంపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అక్రమ నిధుల బదిలీలు...
ప్రపంచ దిగ్గజ బ్యాంకులైన హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ షేర్లు సోమవారం రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. ఈ రెండు బ్యాంకులు సహా పలు ఇతర బ్యాంకింగ్ దిగ్గజాలు గత రెండు దశాబ్దాల్లో భారీగా అక్రమ నిధుల లావాదేవీలు జరిగాయంటూ వచ్చిన వర్తాలు ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈసారి దీపికాపై...
డ్రగ్స్ కేసులో తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొణెపై కంగనా రనౌత్ ట్విట్టర్లో విమర్శలు చేసింది. చిత్రపరిశ్రమలో గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వారంటూ చెప్పుకుని తిరిగే నటులు వాళ్ల మేనేజర్‌ను 'మాల్ ఉందా' అని అడుగుతారని పరోక్షంగా దీపికకు కౌంటర్ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.