- ఎన్నికల నోటిఫికేషన్ రద్దు..
ఏపీలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా ఆయుర్వేద మందు కోసం బారులు..
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ప్రజలు పోటెత్తారు. కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు కోసం బారులుతీరారు. పెద్దసంఖ్యలో తరలివస్తున్న ప్రజలను పోలీసులు అదుపుచేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా మృత్యుఘోష..
దేశంలో కొత్తగా 2 లక్షల 59 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 4,209 మంది వైరస్‌కు బలయ్యారు. గురువారం 20.61 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జీవన విధానానికి ఆదర్శం..
మానవజాతి ప్రగతికి సంస్కృతి ప్రతిబింబంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏర్పాట్లు పూర్తి..
ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ చికిత్సను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ కాసేపట్లో వరంగల్‌లో పర్యటించనున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇప్పటికే ఎంజీఎంలో మెరుగైన సేవలు అందుతున్నాయని.. వాటిని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పదో రోజు పకడ్బందీగా..
రాష్ట్రంలో పదిరోజులుగా లాక్డౌన్ కొనసాగుతోంది. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు రావడం వల్ల ఉదయం 10 గంటల వరకు రహదారులన్ని కిటకిటలాడాయి. పలుచోట్ల కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 13 మంది మావోలు హతం..
మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది మావోలు హతమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండుసార్లు జయించాడు.. కానీ!
రెండుసార్లు కరోనా బారినపడి కోలుకున్న ఓ పోలీసు అధికారిపై బ్లాక్ దాడి చేసింది. బ్లాక్ ఫంగస్‌ను నయం చేసే మందులు ఆ ఆసుపత్రిలో అయిపోవడం వల్ల చికిత్స చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. దాంతో అతను ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలిసినా నోరు మెదపరు..
బాల్ టాంపరింగ్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా దర్యాప్తు సమగ్రంగా లేదన్నాడు ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్. అలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదన్న వాన్.. ఈ వ్యవహారం గురించి జట్టులోని ముగ్గురికి మాత్రమే తెలుసంటే నమ్మశక్యంగా లేదని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఫ్యామిలీ మ్యాన్' ట్రైలర్‌పై వ్యతిరేకత..
సమంత కీలకపాత్రలో నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అయితే ఇది తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని తమిళులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.