- మరో 2.76 లక్షల మందికి వైరస్..
దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 లక్షల 76 వేల మందికి కొవిడ్ సోకింది. మరో 3,874 మంది మరణించారు. బుధవారం 20.55 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇకపై ఇంటి వద్దే కరోనా పరీక్షలు!
కరోనా రెండో దశ పల్లెల్లో ఉద్ధృతంగా ఉన్న క్రమంలో ఇంటి వద్దే కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్).. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పకడ్బందీగా లాక్డౌన్..
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు తొమ్మిదో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓడిన రక్త బంధం..
కొవిడ్‌తో చనిపోయిన ఓ మహిళకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కల్వకుర్తి పట్టణానికి చెందిన ముస్లిం యువకులు. రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు వెనకడుగు వేసిన క్రమంలో.. కులమతాలకు అతీతంగా తామున్నామంటూ ముందుకు వచ్చారు. రక్తబంధం ముందు మానవత్వం గెలిచిందని నిరూపించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా సోకిందా కంగారొద్దు..
కరోనా కాలమిది.. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరి ఇంట్లోకి తొంగి చూస్తుందో.. ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో ఊహించలేని పరిస్థితి..! పొరపాటునో గ్రహపాటునో కరోనా సోకగానే.. చాలా మందిలో మెుగట మెుదలయ్యేది ఆందోళన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ వైరస్ ప్రమాదకరం కాకపోవచ్చు..
భారత్ లో ఉత్పరివర్తనం చెందిన బి.1.617.2 రకం కొవిడ్ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది కాకపోవచ్చని బ్రిటన్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ రకం వ్యాప్తిని అరికట్టడంలో టీకాలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయని విశ్లేషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌కు అమెరికా సాయం..
కొవిడ్‌పై పోరులో భాగంగా ఇప్పటివరకు భారత్‌కు తాము 500 మిలియన్ డాలర్ల సాయం అందించామని శ్వేతసౌధం తెలిపింది. త్వరలోనే.. వివిధ దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు.. భారత్‌కు అదనపు సాయం అందించాలని అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒడుదొడుకుల్లో మార్కెట్లు..
అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలతో ప్రారంభమై 50 వేల ఎగువకు వెళ్లిన సూచీలు.. క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 98 పాయింట్ల నష్టంతో 49,818 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డబ్ల్యూటీసీ టైటిల్ ఎవరిదంటే..
భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కివీస్ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్. ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం కివీస్‌కు కలిసొస్తుందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్ఆర్ఆర్ అప్డేట్..
నందమూరి అభిమానులకు 'ఆర్ఆర్ఆర్' నుంచి సర్ప్రైజ్ వచ్చేసింది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన నయా అవతార్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది అభిమానులను అలరించేలా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.