- కరోనా మృత్యుకేళి..
దేశంలో సోమవారం 18.69 లక్షల నమూనాలను పరీక్షించగా.. 2.63 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే కరోనా మరణాలు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 4,329గా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రఘురామకు పరీక్షలు..
ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి ఆయణ్ను పోలీసులు.. గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పది దాటగానే స్తబ్ధత..
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు ఏడో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో..
కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎంతో మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మహమ్మారి బారిన పడతామనే భయాన్ని కూడా పట్టించుకోకుండా సేవలందిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్న పోలీసులు.. సమయం వచ్చినప్పుడల్లా తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్
అవసరం ఏదైనా.. ఎవరికైనా నేనున్నానంటూ స్పందిస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మిత్రుడి విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూసూద్ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'తౌక్టే' బీభత్సం- నలుగురు మృతి..
గుజరాత్లో తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు గుజరాత్‌లోని ఉనా నగరాన్ని అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి నలుగురు మృతిచెందారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 146 మంది సేఫ్..
ముంబయిలో తౌక్టే తుపాను బీభత్సానికి రెండు వ్యాపార నౌకలు కొట్టుకుపోయి.. 410 మంది గల్లంతైన ఘటనలో 146 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీ లాభాల్లో మార్కెట్లు..
స్టాక్‌మార్కెట్లు మంగళవారం సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 512పాయింట్లకు పైగా లాభపడి50,092 వద్ద కొనసాగుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 169 పాయింట్లకు వృద్ధి చెంది15,092 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముందస్తు బెయిల్ కోరిన సుశీల్..
హత్య కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బ్రహ్మానందం కాల్ చేస్తే కట్ చేశా..
ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'కు ఈ వారం బుల్లితెర జోడీ నిరుపమ్, మంజుల విచ్చేసి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా హాస్యనటుడు బ్రహ్మానందం అప్పుడప్పుడు కాల్ చేసి అభినందిస్తుంటారని చెప్పారు నిరుపమ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.