ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @11AM
TOP TEN NEWS @11AM
author img

By

Published : Apr 11, 2021, 10:59 AM IST

  • ఒక్కరోజే లక్షా 52 వేల కేసులు..

దేశంలో రెండో దశ కరోనా పంజా విసురుతోంది. ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1,52,879 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 839 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరో 3187 కొవిడ్ కేసులు..

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 3,187 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 20,184కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పూలేకు మోదీ నివాళులు..

జ్యోతిరావు పూలే నిబద్ధత భవిష్యత్​ తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు ప్రధాని మోదీ. పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఫిర్యాదుకు ముందుకురాలేక..

తెలంగాణలో వేధింపులు ఎదుర్కొంటున్న బాధితురాళ్లలో మూడొంతుల మంది ‘షీ’ బృందాలకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తాజా అధ్యయనం తేల్చింది. తమకు ఎదురైన వేధింపులపై ఫిర్యాదు చేయాలని ఉన్నా వాటిని ఓ సమస్యగా మార్చడం ఇష్టం లేదని భావించడం, ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియకపోవడం, ఫిర్యాదు చేయడటానికి భయపడటం లాంటివి ఇందుకు కారణాలని వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సర్పంచ్​ సాయం..

సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామ సర్పంచ్ నీలం మధు తన మానవత్వాన్ని చాటుకున్నారు. బ్లడ్ క్యాన్సర్​తో బాధపడుతోన్న ఓ బాలుడి చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. ఆపద సమయంలో ఆపన్నహస్తం అందించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఇది రెండో పెద్ద యుద్ధం..

కరోనా టీకా తీసుకోవడంలో ఇతరులకు సాయం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్​ కార్యక్రమాన్నిప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది కరోనాపై జరుపుతున్న రెండో పెద్ద పోరు అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కఠిన ఆంక్షల్లోకి దేశం!

దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి ఆందోళకరంగా కొనసాగుతుండగా వివిధ రాష్ట్రాలు.. వైరస్​ కట్టడికి కఠిన చర్యలు చేపడుతున్నాయి. దిల్లీలో ప్రజలు గుమిగూడటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలోనే తమిళనాడు, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టాయిలెట్​లో 1.36 కిలోల బంగారం..

దుబాయి నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానం టాయిలెట్​లో దాచిన 1.36 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. అయితే.. పసిడి ఎవరు పెట్టారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మ్యాచ్​లో నమోదైన రికార్డులు!

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో నమోదైన రికార్డులు ఏంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దర్శకుడి క్లారిటీ..

రామ్​చరణ్​తో సినిమాపై స్పందించాడు 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి. తన తదుపరి చిత్రం కోసం ఎవ్వరినీ సంప్రదించలేదని స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.