- కొత్తగా లక్షా 26వేల మందికి కరోనా..
దేశంలో రెండోదశ కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 1,26,789 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 685 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 2 వేలు దాటిన రోజువారీ కేసులు..
రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి రోజురోజుకూ మరింత పెరుగుతోంది. తాజాగా కరోనా కేసులు 2 వేలు దాటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బేగం బజార్ బంద్..
రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతోన్న నేపథ్యంలో బేగంబజార్ వ్యాపార సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరవాలని మూకుమ్మడిగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గాంధీలో మరో 200 ఆక్సిజన్ పడకలు..
రెండో దశలో కరోనా విజృంభిస్తోన్న వేళ... గాంధీ ఆసుపత్రిలో అందుకు తగ్గ సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 300 ఐసీయూ పడకలను ఏర్పాటు చేయగా... ఇంకో 200 ఆక్సీజన్ పడకలు సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మన్యంలో ప్రసవ వేదన..
బిడ్డ బోసి నవ్వులు చూసి మురిసిపోయే యోగం మన్యంలోని మారుమూల గ్రామాల గర్భిణులకు దూరం అవుతోంది. కడుపులో నలుసు పడిన క్షణం నుంచి ఆసుపత్రికి వెళ్లడానికి నడుములోతు నీళ్లు, రాళ్లదారులు, మండే ఎండలు, జోరుగా కురిసే వర్షంలో కాలినడకన, ఎండ్లబండ్లలో పయనం సాగించడం పరిపాటిగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బహిష్కరణలు, ఆందోళనలతో పోలింగ్..
ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 9 శాతం ఓటింగ్ నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్ పాత్ర కీలకం..
ప్రపంచ వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఆర్థిక అసమానతలతో కరోనా టీకా పంపిణీలో పేద దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ-సెన్సెక్స్ 376 పాయింట్లు లాభంతో 50,037 వద్ద కొనసాగుతోంది. మరో సూచీ నిఫ్టీ 109 పాయింట్లు పుంజుకొని 14,928 వద్ద ట్రేడ్ అవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మనోళ్లుంటే ఆ కిక్కే వేరప్పా!
ఈ ఏడాది ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం (ఏప్రిల్ 9) నుంచి ఈ లీగ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లు ఎక్కువ మంది ఏ ఐపీఎల్ జట్టులో ఉన్నారో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జులైలో రామ్‌చరణ్-శంకర్ చిత్రం షురూ..
కథానాయకుడు రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. జులై నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుందని నిర్మాత దిల్‌రాజు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.