ETV Bharat / technology

అన్​లిమిటెడ్ ఫన్: వాట్సాప్​లో న్యూ ఇయర్ ఫీచర్స్.. ఫెస్టివల్ థీమ్​తో స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, యానిమేషన్స్ కూడా..! - WHATSAPP NEW YEAR EFFECTS

వాట్సాప్​లో కాలింగ్ ఎఫెక్ట్స్ ఫీచర్- మీ ప్రియమైనవారికి డిఫరెంట్​గా విషెస్ చెప్పండిలా..!

Whatsapp New Year Effects
Whatsapp New Year Effects (Photo Credit- WhatsApp)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 20, 2024, 6:12 PM IST

Whatsapp New Year Effects: మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగిసి కొత్త సంవత్సరం రాబోతుంది. క్రిస్మస్​ పండగ వచ్చేందుకు కూడా ఎన్నో రోజులు లేవు. ప్రస్తుతం అంతా క్రిస్మస్​, న్యూ ఇయర్ ఫెస్టివల్ హాలీడేస్ ఎంజాయింగ్​​ మూడ్​లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీడియో కాల్స్​, చాట్స్​లో కూడా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు వాట్సాప్​ రెడీ అయింది.

ఇందుకోసం వాట్సాప్​లో న్యూ ఇయర్​కు ముందుగా ఫెస్టివల్ థీమ్​లో కొన్ని ఫన్నీ ఫీచర్లను తీసుకొచ్చింది. కొన్ని రోజుల పాటు వినియోగదారుల కోసం కాలింగ్ ఎఫెక్ట్స్​, యానిమేషన్లతో పాటు స్టిక్కర్లను ప్రవేశపెట్టింది. వీటితో ఈ పండగ సీజన్​లో వీడియో కాల్స్, చాట్‌ను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు వాట్సాప్​ ప్రయత్నిస్తోంది.

వాట్సాప్​లో న్యూ ఇయర్ ఫీచర్లు: ఈ క్రిస్మస్, న్యూ ఇయర్​ హాలీడేస్​లో వాట్సాప్​ యూజర్లు ఫెస్టివ్ బ్యాక్​గ్రౌండ్స్​, ఫిల్టర్స్​ వంటి వాటిని వినియోగించుకోవచ్చని వాట్సాప్​ తెలిపింది. వీటితో పాటు యానిమేషన్లను కూడా తీసుకొచ్చినట్లు, వీటిని వాట్సాప్​లో చాటింగ్ సమయంలో ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.

ఇక వాట్సాప్​లో వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో న్యూ ఇయర్​ థీమ్​తో కొత్త కాలింగ్ ఎఫెక్ట్​లను ఉపయోగించుకోవచ్చు. న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు వీలుగా స్టిక్కర్లనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాట్సాప్​ తెలిపింది.

వీటితో పాటు వాట్సాప్ మరికొన్ని​ కొత్త స్టిక్కర్‌లను కూడా పరిచయం చేసింది. ప్లాట్‌ఫారమ్ క్యూరేటెడ్ న్యూ ఇయర్స్ ఈవ్ (NYE) స్టిక్కర్ ప్యాక్‌తో పాటు న్యూ ఇయర్ థీమ్‌కు సరిపోయే అవతార్ స్టిక్కర్‌లను తీసుకొచ్చింది. హాలిడే విషెస్​ను సరదాగా, ఇంటరాక్టివ్‌గా పంపేందుకు ఈ ఫీచర్లు చక్కటి మార్గమని వాట్సాప్ తెలిపింది.

ఇదిలా ఉండగా వాట్సాప్​ ఇటీవలే నాలుగు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇది హాలీడేస్ సీజన్ కావడంతో యూజర్ కమ్యూనికేషన్ మరింత మెరుగుపర్చేందుకు వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. వీటితో ఆడియో, వీడియో వీడియో కాలింగ్ సమయంలో మెరుగైన ఎక్స్​పీరియన్స్​ను పొందొచ్చు. వాట్సాప్​లో కొత్త ఫీచర్లు యాడ్ కావడంతో గ్రూప్​ కాల్స్​లో ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. దీనితో పాటు వీడియో కాల్స్​లో న్యూ ఎఫెక్ట్స్,​ మెరుగైన డెస్క్‌టాప్ కాలింగ్, బెటర్ వీడియో క్వాలిటీ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. అయితే ఈ కొత్త ఫీచర్లను ఎలా ఉపయోగించాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఓపెన్​ఏఐ మరో అద్భుతం.. ఇకపై వాట్సాప్​తో పాటు ల్యాండ్​లైన్​లోనూ చాట్​జీపీటీ..!- ఎలా ఉపయోగించాలంటే?

మంచి మిడ్​రేంజ్ ఫోన్​ కోసం చూస్తున్నారా?- ఏఐ ఫీచర్లతో టాప్ మోడల్స్ మీకోసం.. ఓ లుక్కేయండి మరి!

సూపర్ ఫీచర్స్, 400 కి.మీ కంటే ఎక్కువ రేంజ్!- ఈ ఏడాది కస్టమర్లను ఫిదా చేసిన ఈవీ కార్లు ఏవో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.