ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @11AM
టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM
author img

By

Published : Nov 20, 2020, 10:58 AM IST

  • 90 లక్షలు దాటాయ్‌..

భారత్​లో కొత్తగా 45,882 మందికి వైరస్​ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షలు దాటింది. మరో 584 మంది మహమ్మారితో మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొత్తగా 894 కరోనా కేసులు..

రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,61,728కి చేరింది. కొవిడ్​తో తాజాగా నలుగురు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 1,423కు పెరిగింది. వైరస్​ నుంచి కొత్తగా 1,057 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మురవనున్న తుంగభద్రమ్మ..

పుష్కర సంగమ తరంగ! కమనీయ వేడుక కందెనవోలు మది నింపింది.. రమణీయ ఉత్సవం జనహృదిని తడిమింది.. శృంగేరి గడపన పుట్టి.. కస్తూరి కన్నడనాడు దాటి.. తెలుగు నేలపై పరవళ్లు తొక్కే పావని తుంగభద్ర! సరిసీమ గడపల్ని నిండుగా ముద్దాడి.. వరి చేల దప్పికను ఆర్తితో తీర్ఛి. తళతళల మేనితో సొగసరి వేణిగా.. సీమ ఇంటి సింగారమంతా తానైన తుంగ.. పుష్కర సంగమ తరంగ! పన్నెండేళ్ల కాలం పుష్కరాగమనానికై వేచి ..నవ్య కాంతులతో.. దివ్యరూపంతో.. అలరారే తుంగభద్ర.. అద్వితీయ పావనముద్ర! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చిన్నారిపై అత్యాచారం..

దేశంలో ఎక్కడో ఓ చోట నిత్యం అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందరో మహిళలు, చిన్నారులు కామాంధులకు బలైపోతున్నారు. తాజాగా చాక్లెట్​ కోసమని కిరాణా దుకాణానికి వెళ్లిన నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సమోసా రూ.10.. కండువా రూ.20

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు ధరలను బల్దియా నిర్ణయించింది. నామపత్రాల దాఖల్లో ఉపయోగించే ప్రతి పదార్థం, వసతులకూ ఓ ధర ఉంటుంందని తెలుపుతూ వాటిని గురువారం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బల్దియా పోలీసులకు లేరు పోటీ..

ప్రపంచంలో ఏ ప్రాంతమైనా సురక్షితంగా ఉండాలన్నా... అభివృద్ధి చెందాలన్నా... శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే సాధ్యం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిందితుల వేటలో వేగం.. మహిళల భత్రతకు ప్రత్యేక వ్యవస్థతో.... రాష్ట్ర పోలీసులను దేశంలోనే నంబర్​ వన్​గా చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఫైటర్​ జెట్ల విన్యాసాలు..

రెండో విడత మలబార్​-2020 నావిక దళ విన్యాసాలు ఉత్తర అరేబియా, హిందూ మహా సముద్రాల్లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్​కు చెందిన మిగ్​-29కే, అమెరికాకు చెందిన ఎఫ్​-18​లు తమ యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 230 పాయింట్లకుపైగా పెరిగి 43,832 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 70 పాయింట్లకుపైగా లాభంతో 12,846 వద్ద కొనసాగుతోంది.

  • వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు..

ఆస్ట్రేలియా సిరీస్​లో మూడు టెస్టుల్లో టీమ్​ఇండియాకు కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టనున్న అజింక్య రహానేకు వెటరన్​ స్పిన్నర్​ హర్భజన్​సింగ్​ శుభాకాంక్షలు తెలిపాడు. కోహ్లీతో పోలిస్తే రహానే భిన్నమైన వ్యక్తని.. ఎట్టిపరిస్థితుల్లో ఆటతీరు, వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దని భజ్జీ అతడికి సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాఘవ హోటల్​ పెట్టాడా?

టాలీవుడ్​ యువ కథానాయకుడు ఆనంద్​ దేవరకొండ నటించిన కొత్త చిత్రం 'మిడిల్​క్లాస్​ మెలోడిస్​'. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల శుక్రవారం (నవంబరు 20) ముందుకొచ్చింది. గుంటూరులో హోటల్​ పెట్టాలనే రాఘవ కల నెరవేరిందా? లేదా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.