ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9am

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News 9am
టాప్​టెన్​ న్యూస్​ @9am
author img

By

Published : Jul 21, 2020, 8:59 AM IST

  • కాస్త తగ్గింది..

తెలంగాణలో కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో తాజాగా 1,198 కొవిడ్​ కేసులు నమోదు కాగా.. వైరస్​తో ఏడుగురు మృతిచెందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో మహమ్మారి బాధితుల సంఖ్య 46,274కు చేరింది. కొవిడ్​ బారినపడి ఇప్పటివరకు 422 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంలోనే అతి తక్కువ..

కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోనే అతి తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా పేర్కొంది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర బృందం ఇచ్చిన నివేదికలను పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ... కొవిడ్ నియంత్రణలకు సంబంధించి పలు సూచనలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ దశకు చేరలేదు..

భారత్​లో మహమ్మారి కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. అందుకు ఆధారాలేమీ లేవని పేర్కొన్నారు. దిల్లీ వంటి నగరాల్లో వైరస్‌ ఇప్పటికే తీవ్ర దశకు చేరుకున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పరీక్షల్లో అస్పష్టత..

కరోనా యాంటీజెన్‌ పరీక్షల్లో అస్పష్టత నెలకొంది. ఇవి 60 శాతం కచ్చితత్వంతో ఉంటున్నాయి. కరోనా లక్షణాలున్న వారికీ నెగిటివ్‌ వస్తోంది. అనుమానితులు బయట తిరుగడం వల్ల వ్యాప్తి పెరుగుతోంది. రెండు రోజులకే కరోనా లక్షణాలు తీవ్రమై ఆరోగ్యం విషమిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పోరాడి ఓడాడు..

మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్​జీ టండన్​ తుదిశ్వాస విడిచారు. జూన్​ 11న స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నారు. 41 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ మాస్కులు వాడొద్దు..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎన్​-95 మాస్కులు సురక్షితమని అందరు నమ్ముతున్నారు. అయితే.. కవాటం ఉన్న ఎన్​-95 మాస్కులను వినియోగించొద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్​ జనరల్​ హెచ్చరించారు. వాటికి డిమాండ్​ పెరిగిన వేళ ఆయన ఎందుకు వాడొద్దని పేర్కొంటున్నారో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎంపిక వారి ఇష్టమే..

ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులు కోరుకున్న చోటు.. సొంతూరికి దగ్గర్లోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని జేఎన్​టీయూ నిర్ణయించింది. సెప్టెంబరులోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్న జేఎన్‌టీయూ విద్యార్థులకు ఐచ్ఛికాలు ఇవ్వాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవిడ్​ పంజా..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. వైరస్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో లక్షా 43 వేలు, బ్రెజిల్​లో 80 వేలు, బ్రిటన్​లో 45 వేలు, మెక్సికోలో 40 వేలు, ఇటలీలో 35 వేల మంది చొప్పున మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెరుచుకున్న థియేటర్లు..

"ఏంటీ.. ఇది థియేటర్‌లో తీసిన ఫొటోలా ఉంది. వీళ్లంతా ఎవరు.. ఇంత ధైర్యంగా థియేటర్‌కి వచ్చారు" అనుకుంటున్నారా? ఆగండాగండి .. ఆశ్చర్యపోయేముందు ఒక్క మాట. ఈ ఫొటో తీసింది మన దేశంలో కాదు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'హరికృష్ణ'కు రెండో స్థానం..

బియల్​ అంతర్జాతీయ చెస్​ ఫెస్టివల్​లో సత్తా చాటుతున్నాడు తెలుగు గ్రాండ్​మాస్టర్​​ పెంటేల హరికృష్ణ. ఇదే వేదికపై బ్లిట్జ్​లో టైటిల్​ గెలిచిన ఈ యువ క్రీడాకారుడు.. తాజాగా జరిగిన ర్యాపిడ్​ సెక్షన్​లో రెండో స్థానంలో నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.