ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9AM

author img

By

Published : Jul 20, 2020, 8:59 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News 9am
టాప్​టెన్​ న్యూస్​ @9am

కొవిడ్ విజృంభణ...

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వెయ్యికి పైగా మంది కరోనా బారిన పడుతున్నారు. ఆదివారం 1,296 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తంగా బాధితుల సంఖ్య 45,076కు చేరింది. ఈ వైరస్‌ బారినపడి మరో ఆరుగురు మరణించారు. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

మోదీతో కేసీఆర్‌

ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కరోనా తీవ్రత, కట్టడికి చేపడుతున్న చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. దేశంలో కరోనా వ్యాధి తీవ్రతపై ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

'హ్యాపీ' బోనాలు

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ బోనాల ఉత్సవాల సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

సమీక్షకు వేళాయె

నీటిపారుదల శాఖ పునర్ ​వ్యవస్థీకరణ ముసాయిదాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు, ఇంజినీర్లతో భేటీ కానున్న సీఎం.. ఇంజనీర్ల వర్క్ షాప్ ద్వారా తయారు చేసిన ముసాయిదాపై చర్చిస్తారు. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

గుడ్ ​న్యూస్

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్​ కోసం ముమ్మర ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్​-19 టీకా వచ్చే అవకాశం ఉన్నట్లు సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా అంచనా వేసింది. టీకా అభివృద్ధిలో ఏడు దేశీయ సంస్థలు ముందంజలో ఉన్నట్లు తెలిపింది. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

నడిసంద్రంలో 'కరోనా'

కొవిడ్​కు సంబంధించి ఓ మిస్టరీ.. శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. అర్జెంటీనాలో 'ఉషుయా' నుంచి చేపల వేటకు బయల్దేరింది ఓ నౌక. అయితే అంతకుముందే అందులోని మత్సకారులను 14రోజులు క్వారంటైన్​లో​ ఉంచి.. అన్ని పరీక్షలు చేయించారు. వాటిలో నెగిటివ్​ వచ్చిన వారిని వేటకు తీసుకెళ్లారు. అయితే నడిసంద్రంలోకి వెళ్లిన ఆ నౌకలో కరోనా కల్లోలం సృష్టించింది. ఇది ఎలా జరిగింది? మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

నిర్ణయాధికారం ప్రైవేటుదే..

దేశంలో ప్రైవేటు పారిశ్రామిక రంగంలో కరోనా సోకిన, మరణించిన వారికి అందించే పరిహారంపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా సంస్థలకే విడిచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత చట్టాల్లో కరోనా విషయం లేనందున.. ఇందుకు సంబంధించిన ఎలాంటి పరిహారమైనా ప్రైవేట్​ కంపెనీలే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

మళ్లీ పరీక్ష అక్కర్లేదు!

ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు.. ఇలా ఒక్కరని కాదు. అన్ని వర్గాలనూ కరోనా అతలాకుతలం చేస్తోంది. వారాల తరబడి పనులు లేకపోవడంతో.. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకుల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం.. పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు(ఎసింప్టమేటిక్‌) లేకపోతే 17 రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి హాజరు కావచ్చని స్పష్టం చేసింది. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

శక్తిమంతంగా బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్​లో హ్యాట్రిక్​ చిత్రం తెరకెక్కుతోంది. గత రెండు చిత్రాల మాదిరిగానే బాలయ్యను రెండు విభిన్న పాత్రల్లో తెరపై చూపించడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారట. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

హంపికి నిరాశ

ఆదివారం జరిగిన మహిళల స్పీడ్​ చెస్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో భారత గ్రాండ్​మాస్టర్​ కోనేరు హంపి ఓటమి పాలైంది. హోరాహోరీగా జరిగిన తుదిపోరులో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కొస్తెనుక్​ చేతిలో హంపి పరాజయం చెందింది. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.