ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - telangana top news

TOP NEWS
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Oct 27, 2021, 5:59 AM IST

Updated : Oct 27, 2021, 8:58 PM IST

20:51 October 27

టాప్​న్యూస్​@ 9PM

  • ఫ్రాన్స్‌లో పెట్టుబడుల వేట 

నాలుగురోజుల పర్యటనలో భాగంగా కేటీఆర్​ బృందం ఫ్రాన్స్​కు వెళ్లింది. భారీగా పెట్టుబడుల సమీకరణ లక్ష్యంతో కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన (IT Minister KTR) చేస్తున్నారు. ఈనెల 28, 29న సెనేట్​లో జరిగే సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.

  • 'ఏదో రోజు పీఓకే మనదే'

పాక్ ఆక్రమిత కశ్మీర్​ను తమ అధీనంలోకి తెచ్చుకునే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని భారత వాయుసేన ఉన్నతాధికారి తెలిపారు. కానీ ఏదో ఒకరోజు ఆ ప్రాంతమంతా భారత్ వశమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • లాలూ అలా.. కాంగ్రెస్​ ఇలా...

ఉపఎన్నికల ముందు బిహార్​లో కాంగ్రెస్​- ఆర్జేడీ పొత్తు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీతో (Sonia gandhi news) ఫోన్​లో మాట్లాడినట్లు చెప్పారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్​ యాదవ్ (Lalu yadav news)​. అయితే.. లాలూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అసలు ఇద్దరి మధ్య సంభాషణ జరగలేదని ఆరోపించారు రాష్ట్ర ఏఐసీసీ బాధ్యులు భక్త్​ చరణ్​ దాస్​.

  • రేషన్​ దుకాణాల ద్వారా వంట గ్యాస్! 

దేశంలోని రేషన్ దుకాణాల ద్వారా చిన్న వంట గ్యాస్ సిలిండర్లు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. చౌక ధరల దుకాణాలకు ఆర్థిక స్థిరత్వం చేకూర్చే ప్రణాళికల్లో భాగంగా ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

  • '​శిల్పాశెట్టి, కుంద్రా.. బెదిరించారు'

నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్​కుంద్రా(sherlyn chopra raj kundra shilpa shetty) తనను మాఫియాతో బెదిరించారని ఆరోపణలు చేసింది నటి షెర్లిన్​ చోప్రా(sherlyn chopra rajkundra). తన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది.

19:51 October 27

టాప్​న్యూస్​@ 8PM

  • 'ప్రత్యేక నిఘా పెట్టండి'

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లపై కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఈఓ శశాంక్ గోయల్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. నియోజకవర్గంలో ఎక్కడా.. నగదు, మద్యం పంపిణీ లేకుండా చూడాలని ఆదేశించారు.

  • ఆ కుటుంబాల గ్రామ బహిష్కరణ

అక్రమంగా భవనం నిర్మిస్తున్నారని ప్రశ్నించిందుకు.. 12 కుటుంబాలను వెలివేశారు(social exclusion) గ్రామ పెద్దలు. వారితో ఎవరూ మాట్లడకూడదని, సాయం చేయకూడదని స్పష్టం చేశారు. ఈ సంఘటన కర్ణాటక, మైసూర్​ జిల్లాలో జరిగింది.

  • 'భారత్‌పై 'కాట్సా' వద్దు'

రష్యా నుంచి ఎస్​ 400 క్షిపణుల కొనుగోలుకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్న కాట్సా ఆంక్షల్ని భారత్​పై అమలు చేయొద్దని(CAATSA sanctions on India) కోరుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు లేఖ రాశారు ఇద్దరు సెనేటర్లు. ఇది భారత్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతకు కూడా సంబంధించిన అంశమని పేర్కొన్నారు. కాట్సా చట్టంలోని నిబంధనల ప్రకారం ఆంక్షల(CAATSA sanctions) నుంచి మినహాయింపునిచ్చే అధికారం అధ్యక్షుడికి ఉందన్నారు.

  • 'రజనీకాంత్​ 'అన్నాత్తే' ట్రైలర్​'

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో రజనీకాంత్​ 'పెద్దన్న' సినిమా ట్రైలర్​ సహా సూర్య 'జైభీమ్', అల్లుఅర్జున్​ 'పుష్ప', దుల్కర్​సల్మాన్​ 'కురుప్​' చిత్రాల సంగతులు ఉన్నాయి.

  • భారత్​తో మ్యాచ్​కు గప్తిల్​ దూరం!

న్యూజిలాండ్​ జట్టుకు మరో షాక్ తగిలింది. టీ20 ప్రపంచకప్​లో భాగంగా టీమ్​ఇండియాతో(IND vs NZ T20) జరిగే మ్యాచ్​కు కివీస్​ ఆటగాడు గప్తిల్(Martin Guptill News) దూరం కానున్నట్లు తెలిసింది. కాలి వేలుకు గాయమైన కారణంగా అతడు మ్యాచ్​కు అందుబాటులో ఉండకపోవచ్చని కివీస్​ జట్టు ప్రధాన కోచ్ గారీ స్టెడ్ అన్నాడు.

18:56 October 27

టాప్​న్యూస్​@7 PM

  • హుజూరాబాద్​లో ముగిసిన ఎన్నికల ప్రచారం

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. గత ఆరు నెలలుగా సాగుతున్న ప్రచారానికి బ్రేక్​ పడింది. మైక్​లు బంద్​ అయ్యాయి. ఎన్నికల 72 గంటల ముందు ప్రచారం ముగించాలన్న ఈసీ ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాయి. రాత్రి 7 తర్వాత స్థానికేతరులు హుజూరాబాద్‌లో ఉండొద్దని ఈసీవో స్పష్టం చేశారు. 

Viral Video: ఆవేదన ఉండదా అండి..?

అందరిది ఓ బాధ అయితే.. వాళ్లది ఇంకో బాధ. కానీ.. ఈ బాధ కొంచెం ఆసక్తికరమండోయ్​. నోట్లతో ఓట్లు కొంటున్నారని.. కొందరు ఆందోళనలు చేస్తుంటే.. ఆ పైసలు మాకు అందలేదని లొల్లి చేస్తున్నారు కొందరు ఓటర్లు. మా ఇంట్ల 5 ఓట్లున్నాయని ఒకరు.. మేము నలుగురం ఉన్నామని ఇంకొకరు.. మేం ఇద్దరమున్నామని ఓ ముసలమ్మ.. ఇలా ఆ ప్రాంత ఓటర్లంతా రోడ్డెక్కారు. "ఇప్పటి వరకు మాకు ఒక్క రూపాయి అందలేదు.. మా సంగతేంది.. మాకు బాధుండదా.." అంటూ.. హుజూరాబాద్​ ఓటర్లు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. మరి వాళ్ల సంగతేంటో.. మీరూ చూసేయండి.

  • 'సూపర్​ హీరో'ను చుట్టుముట్టిన వివాదాలు

ఆ ఎన్​సీబీ అధికారి.. కొద్దిరోజుల కిందటి వరకు సూపర్​ హీరో. ఇప్పుడు సొంత సంస్థే ఆయనపై దర్యాప్తునకు ఉపక్రమించింది. ఒకప్పుడు.. డ్రగ్స్​ ముఠాలకు సింహస్వప్నం. ఇప్పుడు.. ఆ డ్రగ్స్​ కేసుతోనే చిక్కులు చుట్టుముట్టాయి. ఆయనే.. సమీర్​ వాంఖడే (Sameer Wankhede news). కొద్దిరోజుల కింద షారుక్​ తనయుడు ఆర్యన్​ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన.. ఎన్​సీబీ జోనల్​ అధికారి (Sameer wankhede ncb officer) సమీర్​ వాంఖడేపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆయన వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం పడింది. అసలు ఏం జరుగుతోంది? ఏం జరిగింది?

  • 'దీదీ ఇది సబబేనా..?'

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలను, ప్రత్యేకించి టీఎంసీ నాయకులను తమ పార్టీలోకి భారీగా ఆహ్వానించింది భాజపా. కానీ అనుకున్న ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్​ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులకు గాలం వేస్తోంది. ఇప్పటికే చాలామందిని పార్టీలో చేర్చుకుంది. భాజపాపై కాకుండా తమ పార్టీపై తృణమూల్ కాంగ్రెస్​ ఎందుకు దృష్టి సారించిందని హస్తం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

  • దేశంలోనే తొలిసారి..

కేంద్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 'భారత్' రిజిస్ట్రేషన్(BH Series Registration) విధానం అమల్లోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా ముంబయిలో ఓ వాహనం రిజిస్టర్ అయింది. రాష్ట్రాల మధ్య వ్యక్తిగత వాహనాల బదిలీని సులభతరం చేసేందుకు భారత్​ సిరీస్​ (BH-series) మార్క్​తో రిజిస్ట్రేషన్​ ప్రారంభించింది కేంద్రం.

17:55 October 27

టాప్​న్యూస్​@6 PM

  • 'ఇంకో గంట టైముంది'

హుజూరాబాద్​లో తెరాసదే విజయమని అన్ని సర్వేలు చెబుతున్నాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. హుజూరాబాద్​ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2001 నుంచి తెరాస విజయబావుటా కొనసాగుతోందని హరీశ్​రావు పేర్కొన్నారు.

  • రంగంలోకి అమిత్ షా

ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల (UP Election 2022) కోసం అమిత్ షా రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలో భాజపా పట్టు కోల్పోకుండా చూసేందుకు ఇప్పటికే మెగా ప్లాన్​ సిద్ధం (Amit Shah UP Tour) చేశారు. పార్టీ ఆఫీస్ బేరర్లకు బాధ్యతలు అప్పగించి.. నిర్దిష్ట సమయంలోగా పూర్తి చేయాలని లక్ష్యం విధించనున్నారు.

  • ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ వాయిదా

డ్రగ్స్ కేసులో(Aryan khan bail case) అరెస్టయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్​ ఖాన్​ బెయిల్​కు సంబంధించిన హైకోర్టు విచారణ గురువారానికి(అక్టోబర్​ 28) వాయిదా పడింది. ఆర్యన్ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

  • 11 మంది అథ్లెట్లకు ఖేల్​ రత్న

టోక్యో ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధించిన జావెలిన్​ త్రో అథ్లెట్​ నీరజ్​ చోప్రా, రజతం గెల్చుకున్న రెజ్లర్​ రవి దహియాలను ఖేల్​ రత్న వరించింది. మొత్తం 11 మంది అథ్లెట్లను 2021కిగానూ ఖేల్​ రత్న పురస్కారానికి ఎంపిక చేసింది ప్రభుత్వం.

  • పాన్​కార్డుతో జర భద్రం! 

పాన్​ కార్డు నెంబర్లను దుర్వినియోగం (Pan Card misuse) చేస్తూ కొందరు కిలాడీలు మోసాలకు పాల్పడుతున్నారు. చాలా చోట్ల మనకు తెలియకుండానే పాన్‌ వివరాలు ఇచ్చేస్తున్నాం. ఇటీవల ఆన్​లైన్​ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, పాన్​కార్డు వివరాలు బహిర్గతమయ్యాయని తెలుసుకోవడం, కార్డును సురక్షితంగా కాపాడుకోవడం ఎలాగో మీకు తెలుసా?

16:52 October 27

టాప్​న్యూస్​@ 5 PM

  • ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా పరిస్థితులు చేజారినట్లు కనిపించడంతో భారీగా పోలీసులు మోహరించారు.  

  • 'హుజూరాబాద్​లో గెలుపు ఏకపక్షమే'

తెరాస ప్రభుత్వంపై నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్​లో భారీ మెజార్టీతో భాజపా గెలవబోతోందని అర్వింద్​ జోస్యం చెప్పారు. తెరాస నాయకులు హామీలు ఇవ్వటం వరకేనని.. వాటిని అమలు చేయటం వాళ్ల ఇంటావంటా లేదని ఎద్దేవా చేశారు.

  • చైనా సరిహద్దు చట్టంపై భారత్​ ఆందోళన

సరిహద్దులో ప్రజలు నివసించేలా ప్రోత్సహించేందుకు చైనా తీసుకొచ్చిన నూతన చట్టంపై భారత విదేశాంగ శాఖ (China India border fight) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని భారత్-చైనా సరిహద్దులో పరిస్థితులను ఏమార్చే విధంగా చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

  • భారీగా పెరగనున్న వంట గ్యాస్ ధర!

వంట గ్యాస్​ ధరలు(lpg price hike news) మరోమారు భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వం అంగీకారంతో వచ్చేవారం మార్కెటింగ్ సంస్థలు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి.

  • ప్రభాస్​ ఫన్నీ ఇంటర్వ్యూ

'రొమాంటిక్'(Romantic movie release date) సినిమా హీరోహీరోయిన్​ ఆకాశ్​ పూరి, కేతికా శర్మను ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు రెబల్​స్టార్​ ప్రభాస్(romantic movie prabhas)​. వీరి సంభాషణ ఎంతో సరదా సరదాగా సాగింది. ఆ ముచ్చట్లేందో చూసేద్దాం..

15:58 October 27

టాప్​న్యూస్​@4PM

  • పొట్టలో కిలోన్నర వెంట్రుకలు 

మహిళ కడుపులో వెంట్రకల గుట్ట చూసి షాకయ్యారు వైద్యులు. ఆమెకు విజయవంతంగా ఆపరేషన్​ చేసి కేజీన్నర వెంట్రుకలు బయటకు తీశారు. ఈ అరుదైన సర్జరీ ​ కర్ణాటక కొడగులో జరిగింది.

  • ఇంటిని అందంగా చేద్దామనుకున్నారు.. కానీ

దీపావళి పండుగ ముందు ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మట్టిదిబ్బలు కూలి.. ఇద్దరు మృతిచెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

  • 'పెళ్లి'పై సామ్​ ఆసక్తికర పోస్ట్‌

పెళ్లిపై ఆసక్తికర సందేశాన్ని పోస్ట్​ చేశారు హీరోయిన్​ సమంత(Samantha news). ఇప్పుడా పోస్ట్​ నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ సామ్​ ఏమని షేర్​ చేశారంటే.. ​

  • టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల

ఐసీసీ బుధవారం(అక్టోబర్​ 27) టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ, ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ తమ ర్యాంకుల్లో కిందకి పడిపోయారు. కాగా, దక్షిణాఫ్రికా బ్యాటర్ మర్​క్రమ్​, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్​ రిజ్వాన్​ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్​ను దక్కించుకున్నారు.

  • మార్కెట్లకు నష్టాలు

స్టాక్ మార్కెట్లు (Stock Market) బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 207 పాయింట్లు కోల్పోయి 61,143 వద్దకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 57 పాయింట్లు నష్టపోయింది.

14:45 October 27

టాప్​న్యూస్​@ 3PM

  • ​ఫ్రాన్స్‌లో పెట్టుబడుల వేటకు కేటీఆర్..

  • 'మోదీ సభలో బాంబు దాడి' కేసులో ..

పట్నా వరుస బాంబు పేలుళ్ల (Patna Rally Blast) కేసులో నిందితులను దోషులగా తేల్చింది ఎన్​ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం 9 మందికి శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.

  • వాంఖడే చుట్టూ  ఉచ్చు

ఎన్​సీబీ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede news) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పాటు ముంబయి పోలీసు విభాగం ఆయనపై విచారణకు సిద్ధమైంది. ఇప్పటివరకు వాంఖడేపై (NCB Sameer Wankhede) నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, వాటిపై దర్యాప్తు చేసేందుకు ఏసీపీ స్థాయి అధికారిని నియమించినట్లు ముంబయి పోలీసు శాఖ వెల్లడించింది.

  • రాష్ట్రపతి, ప్రధానితో తలైవా.. 

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సూపర్​స్టార్​ రజనీకాంత్..​ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీలతో సతీసమేతంగా భేటీ అయ్యారు.

  • ఉద్యోగులకు లేడీ బాస్ సర్​ప్రైజ్​

అమెరికాలో సారా బ్లేక్లీ అనే వ్యాపారవేత్త(Sara Blakely company).. తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒక్కో ఉద్యోగికి రూ.7.5 లక్షల బోనస్ ప్రకటించారు. దీంతో పాటు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చేందుకు రెండు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు ఇచ్చారు.

13:52 October 27

టాప్​ న్యూస్​ @2PM

  • నేడే ఆఖరి రోజు

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక (huzurabad by election ) సమరంలో కీలకమైన ప్రచార ఘట్టం బుధవారం సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఈ సందర్భంగా బీసీ మంత్రులు ప్రచారం నిర్వహించారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రధాన లక్ష్యంగా మంత్రులు విమర్శలు గుప్పించారు.

  • చట్టప్రకారమే

ఎన్​సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగం సంపాదించారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. వాంఖడే కాల్ రికార్డులను పరిశీలించాలని విజిలెన్స్ కమిటీని డిమాండ్ చేశారు. చట్టప్రకారం వాంఖడే తన ఉద్యోగాన్ని కోల్పోతారని అన్నారు.

  • లాభాల పంట

క్లౌడ్​ కంప్యూటింగ్​ వ్యాపారం పుంజుకుంటున్న నేపథ్యంలో.. మైక్రోసాఫ్ట్​కు (Microsoft results 2021) భారీగా లాభాలు వచ్చాయి. జులై- సెప్టెంబర్​ త్రైమాసికంలో కంపెనీ రాణించింది. 24 శాతం మేర నికర లాభం వృద్ధి చెందినట్లు ప్రకటించింది. మరోవైపు.. అల్ఫాబెట్(Alphabet profit 2021)​ లాభం 68 శాతం పెరగడం విశేషం.

  • మాటల యుద్ధం

భారత్‌, పాకిస్థాన్‌ జట్ల(IND vs PAK) మధ్య మ్యాచ్‌ ముగిసినా.. రెండు దేశాల మాజీ ఆటగాళ్ల మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పాక్‌ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అమిర్ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన పాత వీడియోకు.. స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చాడు టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.

  • సింపుల్‌గా తీస్తే.. 

'కూళాంగల్‌'ను నిజాయతీగా, సింపుల్‌గా చిత్రీకరించినట్లు ఆ సినిమా దర్శకుడు పీఎస్​ వినోద్​రాజ్​ తెలిపారు. ఈ చిత్రాన్ని తన వ్యక్తిగత అనుభవం ఆధారంగా తీసినట్లు పేర్కొన్నారు. భారత్​ తరఫున ఆస్కార్-2022 పోటీలో(Oscar 2022 nominations) ఈ సినిమా నిలిచిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వినోద్​రాజ్​ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

12:49 October 27

టాప్​ న్యూస్​ @1 PM

హుజూరాబాద్​లో కవర్ల కలకలం

హుజూరాబాద్ నియోజకవర్గంలో(Huzurabad by elections 2021) కవర్లు కలకలం రేపుతున్నాయి. డబ్బులతో కూడిన కవర్లను చూసి ఓటర్లు అవాక్కవుతున్నారు. ఒక్కో కవర్​లో రూ.6 వేల నుంచి రూ.10 వేలు ఉండడం గమనార్హం. కాగా నేటితో ప్రచార ఘట్టం ముగియనుంది. ఈ నేపథ్యంలో కవర్ల పంపిణీ చర్చనీయాంశంగా మారింది.

తప్పుడు ప్రచారం తగదు

మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ (Rahul gandhi news). వ్యాక్సినేషన్​పై అసత్యాలు చెప్పి.. ప్రజల జీవితాల్ని రక్షించలేరని అన్నారు. దేశంలో ఇంకా చాలా మందికి టీకా అసలే అందలేదని ఆరోపించారు.

డ్రగ్స్‌పట్టుకుంటే.. పదోన్నతులు!

రాష్ట్ర వ్యాప్తంగా.. ముఖ్యంగా రాజధాని నగరంలో విచ్చలవిడిగా గంజాయి(drugs in telangana) విక్రయాలు కొనసాగుతుండటం, కొకైన్‌, ఎల్‌ఎస్‌డీల, మెఫిడ్రిన్‌, ఎండీఎంఏ వంటి డ్రగ్స్‌ వినియోగం పెరుగుతోందన్న సమాచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌(cm kcr on drugs) ఈ నెల 20న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగానే పదోన్నతుల మాట చెప్పారు.

రజనీకి తొలి సినిమా అవకాశం అలా

ఇప్పటివరకు ఎన్నో అద్భుత చిత్రాలతో మనల్ని అలరిస్తున్న హీరో రజనీకాంత్​కు(rajinikanth movies) తొలి అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ స్టోరీ చదవేయండి.

మాజీ క్రికెటర్​కు అవమానం

పాకిస్థాన్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​కు(Shoaib Akhtar news) ఓ టీవీ ఛానెల్​ ప్రోగ్రామ్​లో చేదు అనుభవం ఎదురైంది. షో మధ్యలోనే బయటకు వెళ్లిపోవాలని హోస్ట్​ చెప్పాడు. దీంతో బయటకు వచ్చేసిన అక్తర్..​ క్రికెట్ విశ్లేషకుడిగా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు.

11:50 October 27

టాప్​ న్యూస్​ @12PM

పెగసస్​పై దర్యాప్తునకు నిపుణుల కమిటీ

పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు (Supreme Court Pegasus) సుప్రీంకోర్టు వెల్లడించింది. పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

అమరీందర్​ సింగ్​ కొత్త పార్టీ

కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్.. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీతో రాష్ట్ర ప్రజల ముందుకు రానున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, గుర్తుపై త్వరలోనే వివరాలు తెలియజేస్తానని తెలిపారు. దీనిపై ఇప్పటికే ఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.

సుడాన్​లో ఆగని నిరసనలు

సుడాన్ ప్రధానమంత్రి అబ్దుల్లా హామ్​డోక్(Sudan PM arrested) ​.. తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించినట్లు అక్కడి సైన్యం ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తిరుగుబాటుకు (Sudan Military Coup) వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు సుడాన్ ప్రజలు. ఈ క్రమంలో సైన్యం వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఇరాక్​లో ఉగ్రదాడి

ఇరాక్​లో (Iraq News) ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాగ్దాద్​కు సమీపంలోని ఉండే ఓ గ్రామంపై దాడి చేసిన వీరు 11 మందిని బలిగొన్నారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

రెండో పెళ్లిపై మనోజ్ ట్వీట్..!

గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలపై హీరో మంచు మనోజ్(manchu manoj movies) క్లారిటీ ఇచ్చారు. తన రెండో పెళ్లి(manchu manoj marriage) గురించి ఆసక్తికర రీతిలో ట్వీట్ చేశారు. ఇంతకీ అందులో ఏం రాసుకొచ్చారంటే?
 
10:49 October 27

టాప్​ న్యూస్​ @11AM

తెలుగు అకాడమీ కుంభకోణంపై విచారణ

తెలుగు అకాడమీ కుంభకోణంపై ఆడిట్‌ శాఖ విచారణ జరపనుంది. రాష్ట్రంలో సంచలనం రేపిన రూ.64.5 కోట్ల ఎఫ్‌డీల కుంభకోణంలో ఇప్పటికే పది మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఆడిట్‌శాఖను ఆదేశించింది.

ఈ చేపలు చాలా కాస్ట్లీ గురూ..

బంగాల్​లోని తూర్పు మెదినీపుర్ జిల్లా దిఘా ప్రాంతంలో మత్స్యకారులకు చిక్కిన చేపలు రికార్డు స్థాయి ధర పలికాయి. పట్టుబడ్డ 33 చేపలను వేలం వేయగా రూ. 1.40 కోట్లు పలికాయి. కిలో రూ. 13వేలకు విక్రయించినట్లు మత్స్యకారులు తెలిపారు.

తగ్గిన పసిడి ధర

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు (Gold Rate Today)తగ్గాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.300 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి.

'భోళాశంకర్' నుంచి క్రేజీ అప్డేట్

అగ్రకథానాయకుడు చిరంజీవి(megastar chiranjeevi movies) దూకుడు చూపిస్తున్నారు. సెట్​పై రెండు సినిమాలు ఉండగానే మరో సినిమా షూటింగ్​లోనూ పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న 'భోళా శంకర్'(bhola shankar movie chiranjeevi) నుంచి అప్డేట్ వచ్చింది.

'అలా మాట్లాడి ఉండకూడదు- క్షమించండి

భారత్​-పాక్​ మ్యాచ్​ తర్వాత తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై(Waqar Younis statement) పాక్​ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్​ క్షమాపణ చెప్పాడు. పాక్​ బ్యాటర్​ మహ్మద్​ రిజ్వాన్​ నమాజ్​ను ఉద్దేశించి చేసిన వకార్ వ్యాఖ్యలపై(Waqar Younis comment) పలువురు మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు విమర్శించిన నేపథ్యంలో అతను స్పందించాడు.

09:52 October 27

టాప్​ న్యూస్​ @10AM

ఇక ప్రలోభాల వంతు!

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక (huzurabad by election ) సమరంలో కీలకమైన ప్రచార ఘట్టం బుధవారం సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది.

మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రూ. కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు

భారత్​లో కొత్తగా 13,451 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. 585 మంది ప్రాణాలు కోల్పోగా.. 14,021 మంది వైరస్​ను జయించారు.

ఒడుదొడుకుల్లో సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ పవనాలతో దేశీయ స్టాక్​మార్కెట్లు బుధవారం ప్లాట్​గా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 102 పాయింట్లు మెరుగుపడి 61,452 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 41 పాయింట్లు వృద్ధి చెంది 18,314 వద్ద ట్రేడ్​ అవుతోంది. 

గంగూలీకి మరోసారి

ఇటీవల ఐపీఎల్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం నిర్వహించిన వేలంలో ఆర్పీఎస్జీ అధినేత సంజీవ్​ గోయంకాకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​​ గంగూలీ సాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలానే పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద గంగూలీ ఒకేసారి రెండు పదవుల్లో కొనసాగుతుండమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

08:50 October 27

టాప్​ న్యూస్​ @9AM

హుజూరాబాద్‌లో కేసీఆర్​ ప్రచారం లేనట్లే!

హుజూరాబాద్ ఉపఎన్నికల(Huzurabad By Election 2021) నేపథ్యంలో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం లేనట్లేనని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. ఈసీ నిర్ణయం వల్లే కేసీఆర్‌ సభ పెట్టలేకపోయామని వెల్లడించారు.

నేటి నుంచి ఫ్రాన్స్​లో కేటీఆర్​ పర్యటన

తెలంగాణలో పోలండ్‌ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తామని మంత్రి కేటీఆర్(ktr news) తెలిపారు. అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతంగా ఉందని, మౌలికవసతులు, మానవ వనరుల లభ్యత, ప్రభుత్వ సహకారం అదనపు బలమని పోలండ్‌ రాయబారి ఆడమ్‌ అన్నారు. తమ దేశంలో పర్యటించాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు.

పెట్రో బాదుడు

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

ఐపీఎల్​లో ఆ జట్టు ఖరీదు

లఖ్​నవూ ఫ్రాంచైజీ(IPL new team) జట్టు ఖరీదు రూ.7,000 కోట్లు కాదని.. దాదాపు రూ.2,000 కోట్లేనని ఆసక్తికర విషయాన్ని చెప్పారు ఆర్పీఎస్జీ గ్రూప్స్​ అధినేత సంజీవ్​ గోయంకా. ఈ విషయంలో సరైనా అంచనాలు వేసుకున్నాకే భారీగా బిడ్​ వేసినట్లు తెలిపారు.

టాలీవుడ్​లోకి పవన్ వారసుడు 

స్టార్ హీరో పవన్​కల్యాణ్​ తనయుడు అకీరా(akira nandan movie).. త్వరలో తెలుగులోని భారీ బడ్జెట్​ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఈ విషయమై చర్చ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత?

07:48 October 27

టాప్​ న్యూస్​ @ 8AM

లఖింపుర్​ ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్​

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరి హింసాకాండలో (Lakhimpur Kheri Violence) భాజపా కార్యకర్తలపై దాడి చేసిన ఇద్దరిని పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేశారు. మరోవైపు ఈ ఘటనలో ప్రధాన నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్​​ మిశ్రా డెంగీ నుంచి కోలుకోవడంతో తిరిగి జైలుకు తరలించారు.

కొత్త పార్టీపై అమరీందర్​ ప్రకటన

పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్ నేడు కొత్త పార్టీని (Amarinder Singh New Party) ప్రకటించే అవకాశం ఉంది. పంజాబ్​ ఎన్నికల నేపథ్యంలో అమరీందర్​ సింగ్​ పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది.

హుజూరాబాద్​ ప్రచారానికి నేటితో తెర

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం తుదిదశకు చేరింది. సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుండటంతో అభ్యర్థులకు మద్దతుగా నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. భాజపా అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌తోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విస్తృతంగా ప్రచారంచేశారు.

విద్వేషాగ్నులకు ఆజ్యం

కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో పేట్రేగుతున్న విధ్వంసకాండకు ఫేస్‌బుక్‌ (Facebook Latest News) వేదికగా ఒక ప్రబుద్ధుడు పంచుకున్న తప్పుడు వార్తే మూలమని ఇటీవలే తేలింది. విద్వేషాగ్నులకు ఆజ్యంపోసే (Facebook Hate Speech) అటువంటి అభ్యంతరకర పోస్టులను నియంత్రించడంలో ఆ సంస్థ నేరపూరిత నిర్లక్ష్యం- యావత్‌ ప్రపంచాన్నే కలవరపరుస్తోంది.

టైగర్ తండ్రిగా అమితాబ్

బాలీవుడ్​లో సరికొత్త కాంబోకు రంగం సిద్ధమవుతోంది. యాక్షన్ హీరో టైగర్​ష్రాఫ్​(tiger shroff movies) తండ్రిగా బిగ్​బీ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

06:45 October 27

టాప్​ న్యూస్​ @ 7AM

ప్రైమరీ విద్యార్థులకు ప్రత్యక్ష బోధన

కొవిడ్​ మహమ్మారి రెండో దశ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతుల(Direct Classes for Primary Schools)కు దూరంగా ఉన్న ప్రైమరీ విద్యార్థులను.. తిరిగి పాఠశాలలకు రప్పించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో దీపావళి తర్వాత 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన సాగనుంది. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపించాయి.

రైతులపై రాయితీల ఆంక్షలు

తన ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి తోడ్పడే విధంగా మద్దతు ధరను (Minimum Support Price in India) నిర్ణయించుకోవడానికి తనకు స్వేచ్ఛ ఉండాలని భారత్​ భావిస్తోంది. వ్యవసాయ ధరల్లో వచ్చే హెచ్చు తగ్గుల నుంచి సన్నకారు, చిన్నకారు రైతులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ క్రమంలో అసలు సబ్సిడీలను లెక్కించడానికి డబ్ల్యూటీఓ అనుసరిస్తున్న విధివిధానాన్ని ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది.

మటన్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త!

వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్(anthrax symptoms) కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల 4 జీవాలు ఆంత్రాక్స్​తో(anthrax symptoms) మృతిచెందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. మాంసం కొనేముందు పలు జాగ్రత్తలు అవసరమని చెప్పింది. ఆ జీవాలను పశువైద్యులు తనిఖీ చేశారో? లేదో నిర్ధారించుకోవాలని... వారు చెప్పింది నమ్మశక్యంగా లేకపోతే జీవాలను కోసిన ప్రాంతాన్ని ఒకసారి చూడాలని సూచించింది.

అక్కడే విజయం సాధించాం: రీతూ వర్మ

మరో రెండు మూడేళ్లు పెళ్లి గురించి ఆలోచనే లేదని హీరోయిన్ రీతూవర్మ(ritu varma new movie) చెప్పింది. 'వరుడు కావలెను' విడుదల(varudu kaavalenu release date) సందర్భంగా చిత్రవిశేషాలను వెల్లడించింది.

బాక్సింగ్‌ ఫైనల్లో నిఖత్​

జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌(Nikhat Zareen news) ఫైనల్​కు చేరుకుంది. బుధవారం జరగనున్న ఫైనల్లో మీనాక్షితో(హరియాణ) నిఖత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఏఐబీఏ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ఆటగాడు శివ థాపా (63.5 కేజీ) శుభారంభం చేశాడు.

04:33 October 27

TOP NEWS@6AM

  • నేడే ప్రచారానికి చివరి రోజు

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం తుదిదశకు చేరింది. సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుండటంతో అభ్యర్థులకు మద్దతుగా నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. భాజపా అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌తోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విస్తృతంగా ప్రచారంచేశారు. తెరాసకు మద్దతుగా మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో పాల్గొన్నారు. 

  •  పొంచి ఉన్న మూడో దశ

అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు ఇప్పుడు మామూలుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు బ్రిటన్‌, రష్యాలలో విరుచుకుపడుతున్న వైరస్‌.. భారత్‌లో ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. నిబంధనల ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే.. మూడోదశ ఉద్ధృతిని విస్మరించలేం. దీంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • ప్రత్యేక బృందాలతో వ్యాక్సినేషన్ వేగవంతం

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వాక్సినేషన్​ ప్రక్రియను మరింత వేగవంతం సీఎస్ సోమేశ్​ కుమార్ (CS SOMESH KUMAR) అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ , వార్డు స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

  • డ్రగ్స్​ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

ఫుడ్ డెలీవరీ బాయ్స్ ముసుగు తొడుక్కుని కొందరు. పార్శిల్‌ బాక్స్‌లో వస్తువుల మాటున మరికొందరు. కూరగాయల చాటున ఇంకొందరు. అందరి లక్ష్యం ఒక్కటే పోలీసుల కళ్లు గప్పటం. ఎలాగైనా సరే సరుకును గమ్యానికి చేర్చటం. ఇకపై ఇలాంటి మత్తులమారి జిత్తులు సాగనీయబోమంటున్నారు పోలీసులు. మాదకద్రవ్యాల మత్తు నుంచి యువతను దూరం చేయటమే లక్ష్యంగా ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు.

  • నీట్​ ప్రవేశాలపై కేంద్రం కీలక ప్రకటన

నీట్​ ప్రవేశాల్లో రిజర్వేషన్​లపై (NEET Latest News) కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈడబ్ల్యూఎస్​ కోటా కింద అర్హులను నిర్ణయించేందుకు విధించిన 'రూ.8 లక్షల వార్షిక పరిమితి' సమంజసమేనని తెలిపింది.

  • బాణసంచా దుకాణంలో పేలుడు- ఐదుగురు మృతి

తమిళనాడులో (Tamilnadu Latest News) ఓ బాణసంచా దుకాణంలో పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు

  • 'కొవాగ్జిన్​'పై- అనుమతులపై 24 గంటల్లో క్లారిటీ

కొవాగ్జిన్​కు అత్యవసర అనుమతులపై (Covaxin WHO approval) డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా సంఘం సమీక్ష నిర్వహించింది. సలహా సంఘం టీకా వివరాలపై సంతృప్తి వ్యక్తం చేస్తే.. 24 గంటల వ్యవధిలో అత్యవసర అనుమతులు లభించే అవకాశం ఉంది.

  • మరింత సమాచారం అవసరం'

కరోనా టీకా కొవాగ్జిన్‌ (Covaxin News) వినియోగ అనుమతిపై.. తుది మదింపునకు భారత్‌ బయోటెక్‌ నుంచి మరింత అదనపు సమాచారం అవసరమని (Covaxin WHO Approval) డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక సలహా బృందం నిర్ణయించింది. ఈ వారాంతంలో ఈ సమాచారం తమకు అందుతుందని భావిస్తోంది.

  • సెట్ నుంచి పారిపోదాం అనుకున్నా

పూరి జగన్నాథ్ హీరోగా అనిల్ పాదురి తెరకెక్కించిన చిత్రం రొమాంటిక్(akash puri romantic movie). ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించిన ఆకాశ్.. సినిమా గురించి పలు విషయాలు వెల్లడించాడు.

టీ20 ప్రపంచకప్​లో భాగంగా షార్జా వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది పాకిస్థాన్. 135 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

Last Updated : Oct 27, 2021, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.