ETV Bharat / city

TOP NEWS: టాప్​ న్యూస్ @3 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
టాప్​ న్యూస్
author img

By

Published : Jul 6, 2022, 2:59 PM IST

  • అధికారమే లక్ష్యంగా భాజపా వ్యూహాలు

Parliament Prawas Yojana: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది భాజపా. ఓ వైపు తెరాస సర్కార్‌ వైఫల్యాలు ఎండగడుతూనే మరోవైపు... కేంద్రప్రభుత్వం ప్రభుత్వ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా... ఎన్డీఏ సర్కార్‌ 8ఏళ్ల పాలనలో అందిస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధిని వివరించడమే లక్ష్యంగా... పార్లమెంట్ ప్రవాస్ యోజనను చేపట్టనుంది. ఈ నెల నాలుగో వారంలో కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

  • బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు

Kishan Reddy in Mahankali Festival: కేంద్ర ప్రభుత్వ నిధులతో దిల్లీలో వైభవంగా మహంకాళి అమ్మవారి బోనాల పండుగ నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దిల్లీ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు.

  • వివో కార్యాలయాలపై ఈడీ దాడులు

ED Raids on VIVO companies : మ‌నీల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై చైనా మొబైల్ ఫోన్ కంపెనీలు ల‌క్ష్యంగా దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని వివో కార్యాలయంలో నిన్నటి నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకూ సోదాలు నిర్వహించారు. వివోతో సంబంధాలు క‌లిగిన సంస్థల్లోనూ దాడులు చేశారు.

  • సీఎం రెండో పెళ్లి.. వధువు ఎవరంటే..!

Cm Second Marriage: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్​ గురువారం పెళ్లి చేసుకోనున్నారు. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో డాక్టర్ గురుప్రీత్​ కౌర్​ను ఆయన వివాహమాడనున్నారు. మరోవైపు, పంజాబ్‌లో ఉచిత విద్యుత్తు నిర్ణయం ఆమోదం పొందింది. గృహ వినియోగదారులు 300 యూనిట్ల వరకు ప్రతి నెలా ఉచితంగానే విద్యుత్​ను పొందొచ్చని సీఎం వెల్లడించారు.

  • 'నుపుర్ తల తెచ్చిస్తే ఇల్లు రాసిస్తా'

Ajmer dargah nupur: భాజపా మాజీ ప్రతినిధి నుపుర్ శర్మ తల తెచ్చినవారికి తన ఇల్లును ఇచ్చేస్తానని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అజ్మేర్ దర్గా మత గురువును పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఆ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

  • టీఎంసీకి మహువా మొయిత్రా గుడ్‌బై

బంగాల్.. క్రిష్ణానగర్​ ఎంపీ మహువా మొయిత్రా.. టీఎంసీ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారిక ట్విట్టర్​ ఖాతాను ఆమె బుధవారం అన్​ఫాలో చేశారు. 'కాళీ' పోస్టర్​కు సంబంధించి ఆమె చేసిన మతపరమైన వ్యాఖ్యలు.. పార్టీకి సంబంధం లేవని టీఎంసీ ట్వీట్​ చేసింది. ఈ పరిణామాలను చూస్తుంటే ఆమె పార్టీకి గుడబై చెప్పడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు, ఆమెను అరెస్ట్​ చేయాలని భాజపా డిమాండ్​ చేసింది. పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని కోరింది.

  • ఠాక్రేపై 'ఆటో- మెర్సిడెస్' పంచ్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందేకు ఠాణెలో ఘన స్వాగతం లభించింది. ఆయన భార్య లత.. డ్రమ్స్ వాయిస్తూ ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఠాక్రేకు చురకలు అంటించారు సీఎం శిందే. ఆటో రిక్షా వేగానికి మెర్సిడెస్‌ వెనుకబడిపోయిందంటూ ఠాక్రేకు కౌంటర్‌ ఇచ్చారు.

  • 'యాసిడ్​' ఈగలతో ఆ రాష్ట్రం హడల్

Nairobi Fly Bengal: బంగాల్​లో 'నైరోబీ ఫ్లై' అనే కొత్త వ్యాధి వ్యాపిస్తోంది. ఆఫ్రికాకు చెందిన 'నైరోబీ ఫ్లై' లేదా 'యాసిడ్ ఫ్లై' అనే ఈగలు.. శిలిగుడి, డార్జిలింగ్ సహా పలు ప్రాంతాల ప్రజల చర్మంపై కాటు వేసి అస్వస్థతకు గురి చేస్తున్నాయి. దీంతో వందలాది మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అసలేంటి ఈ నైరోబీ ఫ్లై? కుడితే వచ్చే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

  • పీవీ సింధు, సాయి ప్రణీత్​ శుభారంభం

Malaysia masters PV Sindhu: మాలేషియా మాస్టర్స్​లో భారత బ్యాడ్మింటన్ స్టార్స్​ పీవీ సింధు, సాయి ప్రణీత్ జోరు ప్రదర్శించారు. రెండు రౌండ్​కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్​లో హి బింగ్‌ జియావొపై సింధు, కెవిన్​ కార్డెన్​పై ప్రణీత్​ గెలిచారు.

  • సామ్​ బాలీవుడ్​ ఎంట్రీ!

Samantha Ayushman Khurana movie: హీరోయిన్ సమంత మరో హిందీ సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది. యంగ్​ హీరో ఆయుష్మాన్​ ఖురానాతో కలిసి ఓ మూవీ చేయనుందట. ఈ ఏడాది చివర్లో ఆ ప్రాజెక్ట్​ సెట్స్​పైకి వెళ్లనుందని టాక్​ వినిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.