ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM - టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM

author img

By

Published : Jul 17, 2022, 11:01 AM IST

  • పాక్​లో ల్యాండైన భారత విమానం..

షార్జా నుంచి హైదరాబాద్​ వస్తున్న ఇండిగో ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం పాకిస్థాన్​లోని కరాచీ ఎయిర్​పోర్ట్​లో ల్యాండయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన పైలట్​.. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఎయిర్​లైన్స్​ ఓ ప్రకనటలో తెలిపింది. ప్రయాణికుల్ని హైదరాబాద్​ రప్పించేందుకు మరో విమానాన్ని పంపుతున్నట్లు పేర్కొంది.

  • తగ్గని కొవిడ్ ఉద్ధృతి..

Covid Cases In India: భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,528 మంది వైరస్​ బారిన పడగా.. 49 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • 90 శాతం వడ్డీ మాఫీ..

Property Tax News: పురపాలకశాఖ ఆస్తిపన్ను బకాయిదారులకు శుభవార్త చెప్పింది. 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ ఓటీఎస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. జీహెచ్​ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తూ ఆ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

  • రైతన్నకు ఆర్థిక భారం తప్పదా..?

అధిక వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటల్లో కొన్ని తిరిగి కోలుకోవడం కష్టంగా మారింది. సోయా, మొక్కజొన్న, పత్తి పైర్ల మొక్కలు మొలిచి 20 నుంచి 25 రోజులే అయినందున లేతదశలో ఉన్నవి వరదలకు తట్టుకోలేవని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనంలో గుర్తించింది. అయితే మళ్లీ విత్తనాలు లేదా నాట్లు వేయడం తమకు ఆర్థికభారంగా మారిందని రైతులు శాస్త్రవేత్తలకు చెబుతున్నారు.

  • జైలులో పోలీసు అధికారి బిందాస్..!

మహిళపై అత్యాచారం, కిడ్నాప్‌, తుపాకీతో బెదిరింపు కేసులో అరెస్టయిన సీఐ నాగేశ్వరరావు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. జైలులో ఉన్న ఆయనలో తప్పు చేశాననే పశ్చాత్తాపం ఎక్కడా కనిపించ లేదని తెలుస్తోంది. తనకేం కాదనే ధీమాగా ఉన్నాడని, అక్కడి సిబ్బందితో తాను తేలికగా కేసు నుంచి బయటపడతానంటూ చెబుతున్నట్లు తెలిసింది.

  • నా భర్తను చంపేయ్‌.. సంతోషంగా ఉందాం..

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో వారం రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య తన ప్రియుడితో చంపించినట్లు తేల్చారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

  • విభజన గాయాలు గుర్తు చేసుకున్న రీనా వర్మ..

1947 దేశవిభజన సమయంలో పాకిస్థాన్​ నుంచి ఇండియా వచ్చేసిన ఓ బామ్మ కోరిక నెరవేరనుంది. పుణెలో నివసిస్తున్న రీనా వర్మ సుమారు 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​కు బయలుదేరారు. ఈ సందర్భంగా దేశ విభజన గాయాలు గుర్తుచేసుకున్నారు భారతీయ వనిత.

  • రోజులో మనిషి పీల్చుకునే ఆక్సిజన్ ఎంతో తెలుసా?

మీరు రోజూ ఎంత గాలి పీల్చుకుంటున్నారో, రోజుకు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో ఎప్పుడైనా లెక్కించారా? ఆరోగ్యవంతులైన వారు నిమిషానికి 16 సార్లు శ్వాస తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం శ్వాస సంబంధిత రోగులపై అధికంగా ఉన్న వేళ మీ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం.

  • పతకంతో ఫెలిక్స్​ అల్విదా!

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో భారత క్రీడాకారుడ మురళీ శ్రీశంకర్​ అదరగొట్టాడు. లాంగ్​జంప్​​ అర్హత రౌండ్లో 8 మీటర్లు దూకి ఫైనల్​కు చేరాడు. ఇతర భారత అథ్లెట్లు జెస్విన్‌ అల్డ్రిన్‌, మహ్మద్‌ అనీస్‌ అర్హత రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు అమెరికా దిగ్గజ అథ్లెట్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ తన ఉజ్వల కెరీర్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకంతో వీడ్కోలు పలికింది. మిక్స్​డ్​ రిలే రేసులో కాంస్యం అందుకుంది ఫెలిక్స్.

  • త్వరలోనే 'ఎన్​బీకే 107' టైటిల్​ అనౌన్స్​మెంట్​..

ఎన్​బీకే 107పై అభిమానులకు ఆసక్తి కలిగించే ఓ అప్డేట్​ వచ్చింది. టీచర్​ విడుదలైనా ఇంకా వర్కింట్​ టైటిల్​తోనే షూటింగ్​ కొనసాగిస్తున్న చిత్రబృందం త్వరలోనే టైటిల్​ను ప్రకటించనున్నట్లు సమాచారం. అంతేకాదు కొత్త షెడ్యూల్​లో భాగంగా మూవీటీమ్​ కర్నూల్​లో షూటింగ్​ను నిర్వహించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.