ETV Bharat / city

Top News: టాప్‌ న్యూస్ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS
author img

By

Published : Aug 2, 2022, 4:58 PM IST

Updated : Aug 2, 2022, 5:06 PM IST

సోషల్ మీడియా వేదికగా రాష్ట్రమంత్రి కేటీఆర్... మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన నేతగా రికార్డ్ సృష్టించారని ఎద్దేవా చేశారు. ఇదేనా భాజపా సాధించిన "ఆత్మ నిర్భర్ భారత్"... అని ప్రశ్నించారు.

  • సర్వేలన్నీ భాజపాకు అనుకూలం..: బండి సంజయ్

ప్రతి భాజపా కార్యకర్త ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి.. సీఎం కేసీఆర్​ను గద్దె దించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేసిన యువత.. భాజపా కోసం పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • 'తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారు'

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర వేదికగా ఆ పార్టీ నేతలు తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 8 ఏళ్ల పాలనలో ఒక్కరోజూ సచివాలయానికి రాని సీఎం కేసీఆర్..​ ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు.

  • 'ఉపాధి హామీపై కొత్త సర్క్యూలర్​ వెంటనే ఉపసంహరించండి..'

దేశంలో ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం సర్క్యూలర్ జారీ చేయటం పేదల నోట్లో మట్టికొట్టడమేనని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. కూలీల వ్యతిరేక నిబంధనలు రూపొందించిన ఆ సర్క్యూలర్​ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు.

  • ఏపీలో దంచికొడుతున్న వానలు..

ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. నిన్న అనంతపురం, సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురవగా నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెరవాడ వాగు దాటేందుకు వెళ్తున్న ఐదుగురిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

  • విమానం కిందకు దూసుకెళ్లిన కారు..

దిల్లీ విమానాశ్రయంలో అనూహ్య ఘటన జరిగింది. ఎయిర్​పోర్ట్​లో నిలిపి ఉంచిన ఓ విమానం కిందకు కారు దూసుకెళ్లింది. విమానం ముందు చక్రాల వరకు కారు వెళ్లిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • ఈ హీరోలంతా వెండితెర సర్కార్ ఆఫీసర్స్

సాధారణంగా మన కథానాయకులు ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కువగా పోలీస్​ డ్రెస్​లో మాత్రమే కనిపించారు. కానీ ఇప్పుడు టీచర్​ నుంచి మొదలు కలెక్టర్​ వరకు అన్ని రకాల గవర్నమెంట్​ ఆఫీసర్​ రోల్స్​ పోషించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సారి ఏయే హీరోలు ఎలా కనిపించారు? ఆ చిత్రాలేంటి? అవి హిట్టా- ఫట్టా? తెలుసుకుందాం!

  • 'విక్రమ్'​ రేంజ్​లో నాగార్జున​ కొత్త సినిమా.. దర్శకుడు అతడే!

ఆలీతో సరదాగా కార్యక్రమానికి 'కార్తికేయ 2' టీమ్​ విచ్చేసి సందడి చేసింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో దర్శకుడు చందూ మొండేటి.. సీనియర్​ హీరో నాగార్జనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనతో చేయబోయే సినిమా గురించి కూడా మాట్లాడాడు.

  • 'మంకీపాక్స్​పై ఆందోళన వద్దు.. వ్యాక్సిన్​పైనా ముందడుగు'

మంకీపాక్స్ విషయంలో దేశ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వైరస్ కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేశామన్న మంత్రి.. వ్యాక్సిన్ విషయంలోనూ చకచకా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.

  • గంజిలో పడి మరణించిన భక్తుడు..

పూజ కోసం చేస్తున్న గంజిలో పడి ఓ వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదం తమిళనాడు మదురైలో జరిగింది. మరో ఘటనలో ఏసీ పేలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

  • 'కేంద్రం చెప్పే స్వదేశీ నినాదం ఇదేనా?'

సోషల్ మీడియా వేదికగా రాష్ట్రమంత్రి కేటీఆర్... మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన నేతగా రికార్డ్ సృష్టించారని ఎద్దేవా చేశారు. ఇదేనా భాజపా సాధించిన "ఆత్మ నిర్భర్ భారత్"... అని ప్రశ్నించారు.

  • సర్వేలన్నీ భాజపాకు అనుకూలం..: బండి సంజయ్

ప్రతి భాజపా కార్యకర్త ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి.. సీఎం కేసీఆర్​ను గద్దె దించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేసిన యువత.. భాజపా కోసం పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • 'తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారు'

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర వేదికగా ఆ పార్టీ నేతలు తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 8 ఏళ్ల పాలనలో ఒక్కరోజూ సచివాలయానికి రాని సీఎం కేసీఆర్..​ ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు.

  • 'ఉపాధి హామీపై కొత్త సర్క్యూలర్​ వెంటనే ఉపసంహరించండి..'

దేశంలో ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం సర్క్యూలర్ జారీ చేయటం పేదల నోట్లో మట్టికొట్టడమేనని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. కూలీల వ్యతిరేక నిబంధనలు రూపొందించిన ఆ సర్క్యూలర్​ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు.

  • ఏపీలో దంచికొడుతున్న వానలు..

ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. నిన్న అనంతపురం, సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురవగా నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెరవాడ వాగు దాటేందుకు వెళ్తున్న ఐదుగురిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

  • విమానం కిందకు దూసుకెళ్లిన కారు..

దిల్లీ విమానాశ్రయంలో అనూహ్య ఘటన జరిగింది. ఎయిర్​పోర్ట్​లో నిలిపి ఉంచిన ఓ విమానం కిందకు కారు దూసుకెళ్లింది. విమానం ముందు చక్రాల వరకు కారు వెళ్లిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • ఈ హీరోలంతా వెండితెర సర్కార్ ఆఫీసర్స్

సాధారణంగా మన కథానాయకులు ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కువగా పోలీస్​ డ్రెస్​లో మాత్రమే కనిపించారు. కానీ ఇప్పుడు టీచర్​ నుంచి మొదలు కలెక్టర్​ వరకు అన్ని రకాల గవర్నమెంట్​ ఆఫీసర్​ రోల్స్​ పోషించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సారి ఏయే హీరోలు ఎలా కనిపించారు? ఆ చిత్రాలేంటి? అవి హిట్టా- ఫట్టా? తెలుసుకుందాం!

  • 'విక్రమ్'​ రేంజ్​లో నాగార్జున​ కొత్త సినిమా.. దర్శకుడు అతడే!

ఆలీతో సరదాగా కార్యక్రమానికి 'కార్తికేయ 2' టీమ్​ విచ్చేసి సందడి చేసింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో దర్శకుడు చందూ మొండేటి.. సీనియర్​ హీరో నాగార్జనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనతో చేయబోయే సినిమా గురించి కూడా మాట్లాడాడు.

Last Updated : Aug 2, 2022, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.