ETV Bharat / city

TOP NEWS: టాప్‌న్యూస్ @ 7PM - TOP NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7pm topnews
7pm topnews
author img

By

Published : Jul 12, 2022, 6:59 PM IST

  • 'ఆర్డీఎస్ పనులు ఆపించండి'

ఆర్డీఎస్ కుడికాల్వ పనులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. కేఆర్‌ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా ఆర్డీఎస్​ కుడికాల్వ పనులు కొనసాగిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు.

  • ఎడతెరిపి లేని వర్షాలు.. కూలుతున్న పాతఇళ్లు

నాలుగు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టిమిద్దెలు నేలమట్టమవుతున్నాయి. పలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్లు ఒక్కసారిగా కూలిపోతున్నాయి. పలు జిల్లాల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లు వరుణుడి దెబ్బకు కుప్ప కూలుతున్నాయి.

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్రకటిత బంద్!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా జిల్లాలోని పలు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో కల్వర్టులు, రోడ్డు దెబ్బతిన్నాయి. జిల్లాలో పల్లె, పట్టణమనే తేడా లేకుండా అప్రకటిత బంద్‌ వాతావరణం నెలకొంది.

  • 'వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..'

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇచ్చే పరిహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. తక్షణ సాయం కింద ఎకరాకు రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • గోదావరికి పోటెత్తిన గంగమ్మ..

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ఏపీలోని ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పాయలైన గౌతమి, వశిష్ట, వైనతేయ ఉద్ధృతికి లంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

  • మత్తడి దూకుతున్న భద్రకాళీ చెరువులో చేపల వేట..

వరంగల్ నగరంలో భారీవర్షాలతో చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. నగరంలోనే పెద్దదైన భద్రకాళీ చెరువు మత్తడి దూకుతోంది. ఆ అందాలను తిలకించేందుకు నగరవాసులు భారీగా తరలివస్తున్నాయి. మత్తడి దూకుతున్న చెరువులో చేపలు విరివిగా లభిస్తున్నాయి.

  • ట్విస్ట్ ఇచ్చిన ఉద్ధవ్..

రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అంశంపై ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే అధికారికంగా ప్రకటించారు.

  • 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు..

ఐదేళ్ల చిన్నారి పట్ల ఓ ఉపాధ్యాయురాలు అత్యంత క్రూరంగా వ్యవహరించింది. హోంవర్క్​ ఎందుకు చేయలేదంటూ 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు కొట్టింది. ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​ జిల్లా అసోహా మండలం ఇస్లామ్​ నగర్​ ప్రాథమిక పాఠశాలలో జులై 9న ఈ ఘటన జరిగింది.

  • 'షార్ట్​కట్​ రాజకీయాల్ని నమ్ముకుంటే షార్ట్ సర్క్యూటే!'

షార్ట్​కట్​ రాజకీయాలు.. దేశానికి అతిపెద్ద సవాలుగా మారాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వాటిపై ఆధారపడితే షార్ట్​ సర్క్యూట్ ఖాయమని హెచ్చరించారు. ఝార్ఖండ్​ దేవ్​గఢ్​లో పర్యటించిన మోదీ.. రూ.16,800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

  • ఇరాన్​కు పుతిన్​.. ఆ అధునాతన డ్రోన్ల కోసమే..

ఉక్రెయిన్​పై యుద్ధం జరుగుతున్న సమయంలోనే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ వచ్చే వారం ఇరాన్​ వెళ్లనున్నారు. ఇరాన్​ నుంచి రష్యా మానవరహిత డ్రోన్ల సాయం కోరిందని అమెరికా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. పుతిన్​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.