ETV Bharat / city

Top news: టాప్ న్యూస్@ 5PM

author img

By

Published : Jul 3, 2022, 4:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news in telangana
టాప్ న్యూస్
  • తెలంగాణ స్పెషల్స్ ఏంటి.. వంటకాలను పరిశీలించిన మోదీ

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనే ప్రతినిధులకు వడ్డించే రుచికరమైన వంటకాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ వంటకాల గురించి ప్రతినిధులు ప్రధానికి వివరించారు.

  • ' ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే.. తెరాస పాలన నడిపిస్తోంది'

KISHAN REDDY: రాష్ట్రంలో అసదుద్దీన్ ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే.. తెరాస పాలన నడిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. తెరాస దిగజారుడు రాజకీయలు చేస్తోందని.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. భాజపా సమావేశాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో గత రెండు రోజులుగా బయటకు కనిపిస్తోందని మండిపడ్డారు.

  • ముగిసిన కార్యవర్గ సమావేశాలు

భాజపా కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. దీంతో కమలనాథులంతా సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్స్​లో జరుగుతున్న విజయసంకల్ప సభకు హాజరయ్యారు.

  • రేపు జగ్గారెడ్డి సంచలన ప్రకటన..!

Jaggareddy Comments: కాంగ్రెస్​లో మరోసారి విభేదాలు భగ్గుమన్న నేపథ్యంలో.. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి చేస్తున్న కీలక వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. రేవంత్​రెడ్డిపై ఇప్పటికే తీవ్ర విమర్శలతో నిప్పులు చెరుగుతున్న జగ్గారెడ్డి.. రేపు సంచలన ప్రకటన చేయనున్నట్టు తెలిపారు.

  • ఆ వార్తలను ఖండించిన యాదమ్మ

Yadamma respond: సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను వంటమనిషి గూళ్ల యాదమ్మ ఖండించారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రధాని మోదీకి వంట చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు యాదమ్మ తెలిపారు.

  • గోల్కొండ కోటలో బోనాల సందడి

Golconda Bonalu: నగరంలో బోనాల సందడి మొదలైంది. ఇవాళ మొదటి ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

  • ఆ 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు లేవా?

Hindu Idols in Taj Mahal: ప్రపంచ 7 వింతల్లో ఒకటైన తాజ్​ మహల్​లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా భారత పురావస్తు శాఖ.. సమాచార హక్కు చట్టం(ఆర్​టీఐ) కింద ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

  • ఈ పోస్టాఫీస్​ పొదుపు పథకాలు తెలుసా?

Post Office Savings Schemes: రిజర్వ్​ బ్యాంకు రెపో రేటును పెంచిన తర్వాత.. ఎస్​బీఐ, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్​ వంటి ప్రముఖ బ్యాంకులు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అయినా కూడా మంచి రాబడిని అందించలేకపోతున్నాయని అంటున్నారు నిపుణులు. వీటితో పోలిస్తే.. పోస్టాఫీస్​ పథకాలు కొన్ని లాభదాయకంగా ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో చూడండి.

  • వారిని చూస్తే రెండు కళ్లు చాలవ్​!

యాంకరింగ్, యాక్టింగ్​తో​ ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై ప్రేక్షకుల్లో క్రేజ్​ సంపాదించుకున్నారు అనసూయ, రష్మి, శ్రీముఖి. ఈ ముద్దుగుమ్మలు సోషల్​మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను పోస్ట్​ చేస్తూ యూత్​లో క్రేజ్​ తెచ్చుకున్నారు. తాజాగా ట్రెడిషనల్​ డ్రెస్సుల్లో కనిపించి ఫ్యాన్స్​ను ఫిదా చేశారు. ఓ సారి వాటిని చూసేద్దాం...

  • కోహ్లీ స్లెడ్జింగ్.. బెయిర్ స్టోతో వాగ్వాదం

Kohli sledges Bairstow: ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదో టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ స్లెడ్జింగ్​కు పాల్పడ్డాడు. బెయిర్​స్టోతో వాగ్వివాదానికి దిగాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్​గా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.