ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 3PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
టాప్ న్యూస్ @ 3PM
author img

By

Published : May 25, 2022, 3:00 PM IST

  • కాంగ్రెస్​కు గుడ్​బై..

కాంగ్రెస్​కు మరో సీనియర్ నేత షాక్​ ఇచ్చారు. చాలా ఏళ్లుగా ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు, ప్రముఖ న్యాయవాది​ కపిల్​ సిబల్​ రాజీనామా చేశారు. బుధవారం సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ సమక్షంలో లఖ్​నవూలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు

  • చిరుతను సజీవదహనం చేసిన ఊరి జనం

Caged leopard burnt alive: బోనులో చిక్కుకున్న చిరుతను గ్రామస్థులు సజీవదహనం చేసిన ఘటన ఉత్తరాఖండ్​లో వెలుగుచూసింది. ఈనెల 15న ఓ మహిళ.. చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అందుకు ప్రతీకారంగా ఈ దారుణానికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. మూడు గ్రామాలకు చెందిన 150 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  • 'నాన్నా.. నన్ను చంపొద్దు ప్లీజ్​'..

Honour killing in bihar: ఇటీవల కాలంలో వరుస పరువు హత్యలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో పరువు హత్య బయటపడింది. వదిలేయమని కన్న కూతురు వేడుకుంటున్నా దారుణంగా హింసించి హత్య చేశాడో వ్యక్తి. నెలరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఆడియో వైరలైంది.

  • కాలేజీలో ఎక్కడ చూసినా 'సారీ.. సారీ'..!

కర్ణాటక బెంగళూరులోని ఓ కళాశాల ప్రాంగణమంతా సారీ.. సారీ అనే పెయింటింగ్​లతో నింపేశారు ఆకతాయిలు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి రాసినట్లు గుర్తించారు. అదే కళాశాలలో చదివే ఓ అమ్మాయి కోసమే వారు ఇలా చేసి ఉంటారని స్థానికులు అనుకుంటున్నారు.

  • ఆ జీవో రద్దు చేయాలంటూ ధర్నా

వరంగల్​ జిల్లా రైతులు ఆందోళన బాట పట్టారు. భూసేకరణ జీవో 80 ఏ రద్దు చేయాలంటూ.. హనుమకొండ- హైదరాబాద్​ జాతీయ రహదారి దిగ్బంధనం తలపెట్టారు. మరోవైపు.. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పలువురు రైతుసంఘ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు.

  • నీరజ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

neeraj honor killing case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బేగంబజార్ వ్యాపారి నీరజ్ పరువు హత్య కేసులో నిందితులను బయటపెట్టాలని అతడి భార్య సంజన, ఆమె తల్లి డిమాండ్ చేశారు. తన భర్తను చంపిన వాళ్లెవరో ఈ లోకానికి తెలియజేయాలని పోలీసులను కోరారు. వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

  • జీవిత బీమా గురించి కుటుంబ స‌భ్యుల‌కు చెప్పారా?

Life insurance policy: భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది జీవిత బీమాకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది ఓ రకంగా మంచిదే అయినా.. కొందరు అసలు ఆ బీమా తీసుకున్నట్టు కుటుంబసభ్యులతో చెప్పరు. ఇదే వారు చేసే పెద్ద తప్పు అంటున్నారు నిపుణులు. బీమా గురించి ఫ్యామిలీకి చెప్పాలంటూ ఐదు కారణాలను వివరించారు. ఆ కారణాలు ఏంటంటే..

  • 12 రోజుల్లో రూ.200 కోట్లు

మహేశ్​బాబు హీరోగా నటించిన 'సర్కారువారి పాట' సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం 12రోజుల్లోనే రూ.200 కోట్లను రాబట్టింది. అలాగే మేజర్​ సినిమాలో 'హృదయమా' సాంగ్​ అప్డేట్​ మీకోసం..

  • స్టార్ డైరెక్టర్ 'లవ్ స్కామ్'.... 17ఏళ్ల సహజీవనం తర్వాత..

'స్కామ్​-1992' వెబ్​ సిరీస్​ దర్శకుడు హన్సల్‌ మెహతా వివాహం బంధంలోకి అడుగు పెట్టారు. 54ఏళ్ల వయుసులో తన చిరకాల ప్రేయసి సఫీనా హుస్సేన్​ను శాన్​ఫ్రాన్సిస్కోలో వివాహమాడారు.

  • 'ఆర్సీబీ కప్పు గెలిచే వరకు పెళ్లి చేసుకోను'

IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్​లో అభిమానులు బాగా సందడి చేశారు. తమ అభిమాన జట్లకు మద్దతు తెలిపేందుకు అరుపులు, కేకలతో పాటు బ్యానర్లను ప్రదర్శించారు. వాటిలో కొన్ని ఫన్నీగా ఉండి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. అందులో టాప్-5 ఇప్పుడు చూద్దాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.