ETV Bharat / city

టాప్ న్యూస్ @ 7PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news
టాప్ న్యూస్
author img

By

Published : Apr 9, 2022, 7:00 PM IST

  • 'మధ్యవర్తిత్వానికి దేశ న్యాయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి'

Alternative Dispute Resolution: ప్రత్యామ్నాయ వివాద పరిష్కారమార్గం ఏడీఆర్​కు దేశ న్యాయపరమైన ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో మీడియేషన్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో మాట్లాడారు.

  • పబ్​లో 24 మంది యువతులు

Police Raid On Pub: అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహిస్తున్న పబ్​పై పోలీసులు దాడి చేశారు. సుమారు 64 మంది యువకులు, 24 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

  • 'ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం..'

KTR Comments: ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, భాజపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రైతులను రాష్ట్రం మోసం చేస్తోందని భాజపానేతలంటుంటే.. కేంద్రం, భాజపానేతలు నాటకాలాడుతున్నారని తెరాస నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా.. ఇది "రైతుల పోరాటమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం" పేరుతో ఓ వీడియో పంచుకున్నారు.

  • గవర్నర్‌తో భేటీ కానున్న పీసీసీ బృందం

Congress protest: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై పోరాటానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమయ్యారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పీసీసీ బృందం సభ్యులు గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. రాష్ట్రంలో ప్రతి గింజ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమెను కోరనున్నారు. ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

  • 'కొండగట్టును ​ గాలికొదిలేశారు..'

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ అభివృద్దిని సీఎం గాలికొదిలేశారంటూ... కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, చొప్పదండి నియోజకవర్గ ఇంఛార్జి మేడిపల్లి సత్యం ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి అభివృద్ది పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

  • ' టర్నోవర్​ను రూ.1000 కోట్లకు పెంచుతాం'

vijaya Dairy: హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లోని పీపుల్స్ ప్లాజాలో విజయ డెయిరీకి చెందిన నూతన ఐస్​క్రీమ్ పుష్​కార్ట్స్​(ట్రై సైకిళ్ల)ను... మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రారంభించారు. తెరాస ప్రభుత్వం వచ్చాక పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చాలా మార్గదర్శకాలు తీసుకువచ్చామని తెలిపారు.

  • 'ఆమెను ఎలా గౌరవించాలో మాకు తెలుసు'

Talasani Srinivas Yadav On Governor: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గవర్నర్లను ఎలా గౌరవించాలో తమకు తెలుసని చెప్పారు.

  • 'ఇమ్రాన్ ఖాన్​ ఓ సైకో​..'

Maryam to Pak PM Imran Khan: పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు పిచ్చిపట్టిందని విమర్శించారు ఆ దేశ విపక్ష నేత మరియమ్ నవాజ్. ఆయనను ఇకపై ప్రధానిగా, మాజీ ప్రధానిగా పరిగణించకూడదని అన్నారు. భారత్​ను ఇమ్రాన్​ ప్రశంసించడంపైనా మండిపడ్డారు మరియమ్.

  • మెగాస్టార్ ఆచార్య ట్రైలర్​

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య ట్రైలర్ అప్డేట్​ వచ్చేసింది. అలాగే దర్శకుడిగా తొలిసారి హిందీలో మెగా ఫోన్​ పట్టుకోబోతున్నారు తేజ.

  • సన్​రైజర్స్​ బౌలర్స్​ అదుర్స్​

CSK vs SRH: సన్​రైజర్స్​ హైదరాబాద్​ బౌలర్లు చెలరేగిన వేళ.. చెన్నై సూపర్​ కింగ్స్​ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.