ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్ @ 5 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana
టాప్​ న్యూస్ @ 5 PM
author img

By

Published : Feb 26, 2022, 4:59 PM IST

  • భారతీయులతో బయల్దేరిన విమానం

Indians in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయుల తరలింపులో పురోగతి సాధిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్​ తెలిపారు. 219 మంది భారతీయులతో రొమేనియా నుంచి విమానం బయల్దేరినట్లు ట్వీట్​ చేశారు. మరోవైపు.. తమ దేశంలోకి వచ్చిన భారతీయులకు సాయం చేస్తామని భారత్​లోని రొమేనియా రాయబారి తెలిపారు.

  • రష్యాపై స్విఫ్ట్‌ ప్రయోగానికి ఫ్రాన్స్‌ మద్దతు

తమ దేశంపై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను దెబ్బతీసేందుకు స్విఫ్ట్‌ ప్రయోగానికి ఫ్రాన్స్‌ మద్దతు ప్రకటించిందని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు. ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ మంత్రితో తాను ఫోన్‌లో మాట్లాడినట్టు చెప్పారు.

  • 'వలస' సంక్షోభం.. ప్రాణాలు అరచేత పట్టుకొని..!

Ukraine Crisis: ఉక్రెయిన్​పై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో సుమారు 50 లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులు దాటుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇప్పటికే రొమేనియా, హంగరీ, పొలండ్​, స్లోవేకియాలోకి ప్రవేశించారు. చంకలో పిల్లలు, చేతిలో సామాన్లతో తమ ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకొని కన్నీటి వీడ్కోలు పలికారు.

  • మహిళపై డ్రైవర్​ అత్యాచారం

హైదరాబాద్​లోని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ట్రావెల్స్ డ్రైవర్‌ బస్సులోనే అత్యాచారం చేశాడని మహిళ పోలీసులను ఆశ్రయించింది.

  • 'అందుకే రాయితీలు'

Hyderabad CP On Traffic Challans: చలాన్లు పేరుకుపోవటం వల్లే రాయితీ కల్పిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆన్‌లైన్, లోక్ అదాలత్ ద్వారా చెల్లింపు సౌకర్యం ఉంటుందని వెల్లడించారు.

  • ఒక్క షార్ట్‌ఫిల్మ్‌.. 900 అవార్డులు

Manasanamaha Short Film: ఒకే ఒక్క షార్ట్‌ఫిల్మ్‌తో రికార్డుల దుమారం రేపాడు బుడమల దీపక్‌రెడ్డి. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే ఐఎఫ్‌ఎఫ్‌ పురస్కారం... వందల్లో అవార్డులు.. ప్రముఖ వేదికలపై ప్రదర్శితమైన సినిమాగా ప్రపంచ రికార్డు ఘనత... మరి ఈ విజయం వెనక ఉన్న కష్టమేంటి? అందిన ఫలితమేంటి...? అనే విషయాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

  • రూ. 13.7 కోట్ల హెరాయిన్ సీజ్​​

Drugs Trafficking: రూ.7 కోట్ల విలువైన 1.04 కేజీల హెరాయిన్​ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ తరలింపుకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

  • చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స

Rare Surgery in Kerala: అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ చిన్నారిని రక్షించారు కేరళ వైద్యులు. శిశువు జీర్ణక్రియలో ఉత్పత్తి అయ్యే ద్రవం ఛాతీలోకి లీక్ అవుతుందని గుర్తించి ఆమె ప్రాణాలు కాపాడారు.

  • ఆ రోజు సెట్​ నుంచి పారిపోయా

Bheemla nayak trivikram: 'భీమ్లా నాయక్' సక్సెస్​ మీట్​లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ సినిమా పరిస్థితులు అన్ని కుదిరాయని, అందుకే ప్రేక్షకాదరణ దక్కించుకుందని అన్నారు.

  • వారు లేకుండానే​ 100వ టెస్టు

Kohli 100 Test: మొహాలీ వేదికగా జరిగే విరాట్​ కోహ్లీ 100వ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించట్లేదని పంజాబ్​ క్రికెట్​ అసోసియేషన్​ వెల్లడించింది. ఈ నిర్ణయంతో కోహ్లీ అభిమానులకు నిరాశే మిగిలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.