ETV Bharat / city

TOP NEWS: టాప్​ న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Feb 1, 2022, 11:02 AM IST

TOP NEWS 11 AM
టాప్​ న్యూస్ @ 11AM

కేంద్ర బడ్జెట్​కు ఆమోదం

వార్షిక బడ్జెట్​ 2022-23కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో పార్లమెంటులోని లోక్​సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

  • ఈసారి కూడా ఎర్రటి బ్యాగులోనే..

Union Budget 2022: బడ్జెట్​ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది.. ఆర్థిక శాఖ మంత్రి చేతిలోని సూట్​కేసు. ఎన్డీఏ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చారు ఆర్థిక మంత్రి. ఈసారి కూడా అదే ట్రెండ్​ కొనసాగించారు. ఎర్రటి బ్యాగులో ట్యాబ్​లో బడ్జెట్​ను తీసుకొచ్చారు. కరోనా కారణంగా ప్రతులు ముద్రించలేదు. యాప్​లో అందరికీ అందుబాటులో ఉంచుతారు.

  • తగ్గిన గ్యాస్ ధర!

LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధర రూ. 91.50 మేర తగ్గించినట్లు చమురు సంస్థలు తెలిపాయి. సవరించిన ధరలు ఫిబ్రవరి 1 నుంచే అమలుకానున్నట్లు పేర్కొన్నాయి.

  • కళకళలాడుతున్న పాఠశాలలు

రాష్ట్రంలో మరోసారి బడి గంట మోగింది. నిన్నటి దాకా వెలవెలబోయిన పాఠశాలలు, కళాశాలలు నేడు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా మూడో దశ, ఒమిక్రాన్ వ్యాప్తితో జనవరి 31వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడం వల్ల విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఇవాళ తెరుచుకున్నాయి.

  • 18 రైళ్లు రద్దు.. ఎందుకంటే?

Trains cancelled Today : ఇవాళ్టి నుంచి ఈనెల 7వరకు 18 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిర్వహణ లోపాల వల్లే వీటిని రద్దు చేసినట్లు తెలిపింది. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

  • 2 లక్షల దిగువకు కరోనా కేసులు

Coronavirus Update: భారత్​లో కరోనా కొత్త కేసులు 2 లక్షల దిగువకు చేరాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మరో 1,67,059 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1192 మంది మరణించారు. 2,54,076 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • భారత్​పై పాక్​ విష ప్రచారం..

India ban on Pakistan social media accounts: భారత్​పై దాడి చేసేందుకు ప్రతీ వనరుని పాకిస్థాన్​ అస్త్రంగా వాడుకుంటోంది. కొత్తగా సామాజిక మాధ్యమాల్లో భారత్​పై విష ప్రచారం చేస్తోంది. ఇలా మన దేశంపై విషప్రచారం చేస్తున్న 35 యూట్యూబ్‌ ఛానళ్లతోపాటు రెండు ట్విటర్‌ ఖాతాలు, రెండు వెబ్‌సైట్లు, రెండు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను కేంద్రం నిషేధించింది. ఇలా బ్యాన్​ చేయడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

  • ఆ 'నిరుద్యోగి' క్రియేటివిటీకి ఫిదా.. !

యూకేకు చెందిన ఓ నిరుద్యోగి యార్క్‌షైర్‌లో ఉన్న ఇన్‌స్టాంట్‌ప్రింట్‌ అనే కంపెనీ ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందరిలా తాను రెజ్యుమ్‌ పంపిస్తే యాజమాన్యం దృష్టిలో పడనేమోనని భావించి.. కొత్త పంథాను ఎంచుకున్నాడు.

  • దూసుకెళ్తున్న స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా వృద్ధితో 58 వేల 725 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 240 పాయింట్లు పెరిగి 17వేల 340 వద్ద కొనసాగుతోంది.

  • ఆ హీరోయిన్​ను పిచ్చిదనుకున్నారు!

సినిమా షూటింగ్​లో భాగంగా ఓ హీరోయిన్​ రోడ్లపై పరిగెడుతుంటే అక్కడి స్థానికులు ఆమెను పిచ్చిదనుకున్నారట! అలా రోడ్లపై పరిగెడితే ఏ వాహనం కింద పడిపోతుందోనని ఆమెను పట్టుకుని వదిలిపెట్టలేదు. ఇంతకీ ఆ సినిమా షూటింగ్ ఏంటి? కథానాయిక ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.